»   » బాలయ్యతో నయన్ లుక్ ఇదే: బాలకృష్ణ 102 లో నయనతార లుక్

బాలయ్యతో నయన్ లుక్ ఇదే: బాలకృష్ణ 102 లో నయనతార లుక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలకృష్ణ కథానాయకుడిగా ఆయన 102వ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. కె.ఎస్. రవికుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా నయనతారను తీసుకున్నారు. హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో కొన్ని రోజులుగా జరుగుతోన్న ఫస్టు షెడ్యూల్ షూటింగులో .. కొన్ని కీలకమైన సన్నివేశాలతో పాటు, యాక్షన్ సీక్వెన్స్ ను కూడా చిత్రీకరిస్తున్నారు. తాజాగా ఈ రోజు ఈ సినిమా షూటింగులో నయనతార జాయిన్ అయింది.

రెగ్యులర్ షూటింగ్ లో

రెగ్యులర్ షూటింగ్ లో

ఇటీవల ఘనంగా ప్రారంభోత్సవం జరుపుకొన్న ఈ చిత్రంలో నయనతారను కథానాయికగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. నేటి నుండి ఆమె సినిమా రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటుంది. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షెడ్యూల్ ప్రస్తుతం హైద్రాబాద్ లోని రామోజీ ఫిలిమ్ సిటీలో జరుగుతోంది.

Nayanatara Does This In Her Free Time ఖాళీ టైం లో నయన్ చేసే పని ఇదా ?
సింహా, శ్రీరామరాజ్యం

సింహా, శ్రీరామరాజ్యం

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సి.కళ్యాణ్‌ మాట్లాడుతూ.. ""సింహా, శ్రీరామరాజ్యం" లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అనంతరం బాలకృష్ణ-నయనతార కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. ఆ సినిమాల స్థాయిలోనే ఈ సినిమాలోనూ వారి మధ్య కెమిస్ట్రీ ఉండనుంది. బాలకృష్ణగారి కెరీర్‌లోనే ఇది మరో సంచలన చిత్రం అవుతుంది" అన్నారు.

పారితోషికంగా భారీ మొత్తమే

పారితోషికంగా భారీ మొత్తమే

మలయాళ భాషల్లో బిజీగా వున్న నయనతార, ఈ సినిమా కోసం పారితోషికంగా భారీ మొత్తమే తీసుకుందనే టాక్ వినిస్తోంది. బాలకృష్ణ సినిమా తరువాత ఆమె చిరంజీవితో చేయనుండటం విశేషం . మహావీరగా రానున్న "ఉయ్యాలవాడ నరసిమ్హారెడ్డి" లోనూ నయన్ ఎంపికైన సంగతి తెలిసిందేకదా

ముఖ్యపాత్రలు

ముఖ్యపాత్రలు

బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, అశుతోష్ రాణా, మురళీమోహన్, బాహుబలి ప్రభాకర్, శివపార్వతి తదితరులు ఇతరముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ భారీ చిత్రానికి కథ-మాటలు: ఎం.రత్నం, యాక్షన్: అంబరీవ్, కెమెరా: సి.రాంప్రసాద్, సంగీతం: చిరంతన్ భట్, కో-ప్రొడ్యూసర్‌: సి.వి.రావు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: సి.తేజ, సి.వరుణ్‌కుమార్‌, నిర్మాత: సి.కళ్యాణ్‌, దర్శకత్వం: కె.ఎస్‌.రవికుమార్‌.

English summary
Nandamuri Balakrishna’s new film, to be directed by KS Ravi Kumar, began its shooting in Hyderabad. The film stars Nayanthara as its lead heroine.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu