twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నయనతార నిర్ణయం... సీనియర్ హీరోలకు పెద్ద దెబ్బే

    By Srikanya
    |

    హైదరాబాద్: హీరోయిన్స్ కు వయస్సు ఎలా కన్నా...ఆమె చేసిన సినిమాల వయస్సే కౌంట్ అవుతుంది. దాంతోనే వారి సీనియారిటీ లెక్క వేస్తారు. దాంతో సీనియారిటీ పెరిగే కొలిదీ కుర్ర హీరోలు వాళ్లతో చేయటానికి ఆసక్తి చూపరు. ఇప్పుడు అదే పరిస్ధితి నయనతారకు ఎదరౌవుతోంది. ఆమె బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి సీనియర్ హీరోలతో చేయటంతో ఆమెతో యంగ్ హీరోలు ఎవరూ జతకట్టే పరిస్దితి కనపడటం లేదు. దాంతో ఆమె ఇప్పుడు సీనియర్ హీరోలకే పరిమితమైపోవాల్సిందేనా...నేనెంత నా వయస్సు ఎంత అని వాపోతోందిని చెప్పుకుంటున్నారు. కొంతకాలం పాటు సీనియర్ హీరోలకు బ్రేక్ ఇస్తే బాగుంటుందని భావిస్తోందిట. అసలే సీనియర్ హీరోలకు హీరోయిన్స్ దొరక్క ఇబ్బంది పడుతూంటే...నయనతార వంటి వారు కూడా నటించనంటే పరిస్ధితి ఏమిటన్నది వారిని ఇబ్బంది పెట్టే అంశం.

    అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సెకండ్‌ ఇన్నింగ్స్‌లోనూ ఘన విజయాలు అందుకుంటున్న నటి నయనతార. అయితే ఆమెతో కలిసి నటించేందుకు సీనియర్‌ హీరోలు ఉత్సాహం చూపుతున్నా.. కొత్త హీరోలు మాత్రం ఆమెతో కలిసి నటించేందుకు విముఖతగానే ఉన్నారట. దీంతో పెద్ద హీరోల చిత్రాల తర్వాత తనకు పరిస్థితులు ప్రతికూలంగా మారే అవకాశముందని, టాలీవుడ్‌పై దృష్టి సారించేలా అక్కడి నిర్మాతలకు అందుబాటులో ఉండేందుకు హైదరాబాద్‌కు మకాం మార్చేందుకు సిద్ధమైనట్లు కోలీవుడ్‌ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఆమె సన్నిహితవర్గాలు కూడా ఈ వార్తలను సమర్థిస్తున్నాయి.

    Nayantara don't want to work with seniar Hero's

    కొందరు సన్నిహితులు మాట్లాడుతూ నయనతారకు కోలీవుడ్‌లోనూ కాదు.. టాలీవుడ్‌లోనూ ఎంతో మంది సన్నిహితులు, శ్రేయేభిలాషులు ఉన్నారని చెప్పారు. ప్రస్తుతం ఆమె తమిళంలో మూడు చిత్రాల్లో నటిస్తోందని, తనకు ఎంతో గుర్తింపు ఉన్న టాలీవుడ్‌లోనూ కనీస సంఖ్యలో సినిమాలు చేసేందుకు నిర్ణయించుకుందని పేర్కొంటున్నారు. అక్కడి నుంచి కూడా మంచి అవకాశాలు ఆమె తలుపుతడుతున్నాయని తెలిపారు. వాటిని సద్వినియోగం చేసుకునేలా.. హైదరాబాద్‌లో స్థిర నివాసం ఏర్పరచుకోనుందని పేర్కొన్నారు.

    సెకండ్ ఇన్నింగ్స్ గురించి నయనతార మాట్లాడుతూ... ''చిత్ర పరిశ్రమకి నేనెప్పుడూ దూరం కాలేదు. అందుకే కెరీర్‌ని మళ్లీ కొత్తగా ప్రారంభించానని నాకెప్పుడూ అనిపించలేదు. అందరూ అంటున్నారు కాబట్టి నేను కూడా రెండో ఇన్నింగ్స్‌ మొదలు పెట్టాననే చెబుతున్నాను. నాపై ప్రేక్షకులు ఎప్పట్లాగే ఆదరణ చూపిస్తుండడం మాటల్లో చెప్పలేనంత అనుభూతినిస్తోంది. దర్శకులకు కూడా నాపై మరింత నమ్మకం పెరిగిందేమో మరి. అందరూ ప్రాధాన్యమున్న పాత్రలను అప్పజెబుతున్నారు. ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?'' అని చెప్పుకొచ్చింది.

    ఇక నయనతార తాజా చిత్రం అనామిక విషయానికి వస్తే...సగటు ఇల్లాలు... అనామిక. ఆమెకి భర్త, ఇల్లే లోకం. సరదాగా సాగిపోతున్న ఆమె కాపురంలో ఉన్నట్టుండి ఓ అలజడి. తన భర్త ఎక్కడో తప్పిపోయాడు. ఎటు వెళ్లాడో, ఎలా వెళ్లాడో తెలియదు. ఎంత ఎదురు చూసినా ఫలితం లేదు. దీంతో తనే భర్త కోసం అన్వేషణ మొదలుపెట్టింది. హైదరాబాద్‌ పాతబస్తీకి చేరుకొంది. ఎదురు పడిన ప్రతీ ఒక్కరినీ 'నా భర్త జాడ చెప్పరూ' అంటూ వేడుకొంటోంది. మరి అనామిక భర్త దొరికాడా? లేదా? తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అంటున్నారు శేఖర్‌ కమ్ముల. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'అనామిక'.

    నయనతార ప్రధాన పాత్రలో నటించింది. వైభవ్‌, హర్షవర్ధన్‌ రాణే కీలక పాత్రలు పోషించారు. సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. దర్శకుడు మాట్లాడుతూ ''ప్రస్తుత సమాజాన్ని ప్రతిబింబించే కథ ఇది. భర్త జాడ కనుక్కొనేందుకని బయటికి వచ్చిన ఓ మహిళకి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయనేది ఆసక్తికరం.

    హిందీ 'కహానీ' ఆధారంగా రూపొందిన చిత్రమే అయినా... మన వాతావరణానికి తగ్గట్టుగా కథలో మార్పులు చేశాం. ఇందులోని భావోద్వేగాలు మనసుల్ని హత్తుకొనేలా ఉంటాయి. పాతబస్తీ ప్రాంతాన్ని కొత్తకోణంలో చూపించే ప్రయత్నం చేశాం'' అన్నారు. ఈ చిత్రాన్ని వయాకామ్‌ 18, ఐడెంటిటీ మోషన్‌ పిక్చర్స్‌, లాగ్‌లైన్‌ పిక్చర్స్‌ సంస్థలు కలిసి నిర్మించాయి.

    English summary
    “I am very proud of the fact that many young heroes have expressed interest to act with me. I would like to act with these younger heroes to stay up to the market demand”, says Nayantara
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X