»   » అవార్డుతో నయనతార: ప్రియుడితో హ్యాపీ మూమెంట్స్ (ఫోటోస్)

అవార్డుతో నయనతార: ప్రియుడితో హ్యాపీ మూమెంట్స్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన వార్తలతో ఎప్పుడూ మీడియాలో హైలెట్ అవుతూ ఉంటుంది. కెరీర్ తొలినాళ్లలో శింబుతో నయనతార లవ్వాయణం, ఇద్దరి చాటు మాటు రొమాన్స్ ఫోటోస్ లీక్ అవ్వడం అప్పట్లో ఓ సెన్సేషన్.

శింబుతో విడిపోయిన తర్వాత ప్రభుదేవాతో నయనతార ప్రేమాయణం గురించి తెలిసిందే. దాదాపు పెళ్లి వరకు వచ్చిన వీరు చివరి నిమిషయంలో విడిపోయారు. ప్రభుదేవాతో విడిపోయిన తర్వాత సినిమాల్లో బిజీ అయిపోయింది నయనతార.

తర్వాత 'నానుం రౌడీ దాన్‌' చిత్రంలో నటించిన నయనతార ఈ చిత్ర దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ప్రేమలో పడిందని, ఆ మధ్య వీరికి రహస్యంగా వివాహం జరిగినట్లు కూడా వార్తలు వెలువడ్డాయి. అయితే ఇద్దరూ ఈ వార్తలను ఖండించారు. పెళ్లి విషయం ఖండించినా ఇద్దరి మధ్య లవ్ ఎఫైర్ ఉందనే ప్రచారం జరిగింది.

అయితే ఇటీవల నయనతార, విఘ్నేష్ శివన్ విడిపోయినట్లు తమిళ మీడియాలో వార్తలు వినిపించాయి. అయితే అలాంటి దేమీ లేదని ఇటీవల ఫిల్మ్ ఫేర్ అవార్డుల వేడుకలో తేలిపోయింది. ఇద్దరి మద్య రిలేషన్ షిప్ కొనసాగుతోంది.

అవార్డుతో..

అవార్డుతో..

అవార్డు అందుకున్న అనంతరం ఆమె ప్రియుడుగా ప్రచారంలో ఉన్న విఘ్నేష్ శివన్ తో కలిసి నయనతార.

ప్రేమాయణం

ప్రేమాయణం

నానుం రౌడీ ధాన్ సినిమా సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ మొదలైనట్లు టాక్.

దగ్గరయ్యారు

దగ్గరయ్యారు

షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగిందని అంటున్నారు.

త్వరలో వివాహం

త్వరలో వివాహం

త్వరలో ఇద్దరూ వివాహం చేసుకోబోతున్నట్లు తమిళ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

గతంలో రూమర్స్

గతంలో రూమర్స్

గతంలో వీరిద్దరికి పెళ్లయినట్లు రూమర్స్ వినిపించాయి.

తమిళ కేటగిరీలో 'నాను రౌడీ ధాన్' సినిమాలో నయనతార చెవిటి అమ్మాయిగా అద్భుతమైన నటన కనబరిచినందుకు గాను ఉత్తమ నటి అవార్డు గెలచుకుంది. అవార్డు అందుకున్న అనంతరం తన ప్రియుడు విఘ్నేష్ శివన్ తో నయనతార హ్యాపీ మూమెంట్స్ షేర్ చేసుకుంది. అందుకు సంబంధించిన ఫోటో ఇపుడు ఇంటర్నెట్లో వైరల్ లా వ్యాపించింది.

English summary
Actress Nayantara is said to be in relationship with Tamil director Vignesh Shivan. There were also rumors that the two got married secretly. However the duo rubbished the claims. Now a picture of the duo is going viral on web. Nayan recently won filmfare Best actress award for her performance Naanum Rowdy Dhaan directed by Vignesh.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu