»   » తీరు మారని నయనతార, శేఖర్ కమ్ముల అప్‌సెట్!

తీరు మారని నయనతార, శేఖర్ కమ్ముల అప్‌సెట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ నయనతార శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించిన 'అనామిక' చిత్రం మే 1న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 16న ఆడియో విడుదల చేయడానికి ప్లాన్ చేసారు. అయితే నయనతార కారణంగా ఆడియో వేడుకను క్యాన్సిల్ చేసినట్లు తెలుస్తోంది.

సినిమా ప్రమోషన్లో భాగంగా ఆడియో వేడుకను నిర్వహించడం ఈ మధ్య ఎంతో కీలకంగా మారింది. అయితే సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్న నయనతార రానని చెప్పడంతో దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ వేడుకను రద్దు చేసారు. కేవలం సాదాసీదాగా విలేకరుల సమక్షంలో పాటలు విడుదల చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

Nayantara no mood to attend the Anamika audio launch

ప్రభుదేవాతో విడిపోవడానికి ముందు నయనతారపై ఓ రిమార్కు ఉండేది. అప్పట్లో ఆమె భారీ రెమ్యూనరేషన్ తీసుకుని సినిమాల్లో నటించేది కానీ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు డుమ్మా కొట్టేది. అయితే ప్రభుదేవాతో విడిపోయిన తర్వాత నయనతారలో చాలా మార్పు వచ్చిందని, ఆమె సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటుందని పలువురు నిర్మాతలు సంతోషం వ్యక్తం చేసారు. అయితే మళ్లీ నయనతార గతంలో మాదిరి....'అనామిక' ప్రమోషన్ కార్యక్రమాలకు డుమ్మా కొట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'అనామిక'. హిందీలో విజయవంతమైన 'కహానీ' సినిమా ఆధారంగా రూపొందుతోంది. అక్కడ విద్యాబాలన్‌ పోషించిన పాత్రలో ఇక్కడ నయనతార నటిస్తోంది. వైభవ్‌, హర్షవర్ధన్‌ రాణే కీలక పాత్రలు పోషిస్తున్నారు. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. ఎండమోల్‌ ఇండియా, లాంగ్‌లైన్‌ ప్రొడక్షన్స్‌, సెలెక్ట్‌ మీడియా హోల్డింగ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం సెన్సార్ ఇప్పటికే పూర్తైంది. 'U/A'సర్టిఫికేట్ పొందిన ఈ చిత్రం మే 1న విడుదలవుతోంది.

English summary
Sekhar Kammula's Anamika is scheduled for April 16th as the makers have fixed May 1st as the release date of the movie. This function is cancelled in the last minute due to the Nayantara no mood to attend the audio launch.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu