»   »  సాధుతో నయనతార???

సాధుతో నయనతార???

Posted By:
Subscribe to Filmibeat Telugu


నయనతారకు తెలుగులో మరో అవకాశం వచ్చింది. అదీ నందమూరి బాలకృష్ణతో. గుణశేఖర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనున్నది. ఈ చిత్రానికి సాధు పేరును ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమా రూ.25 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందనున్నది. గుణశేఖర్ తొలుత ఈ సినిమా కథను చిరంజీవికి వినిపించినప్పటికీ ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో బాలకృష్ణకు చెప్పాడు. ఆయన ఓకే చేయడంతో ఈ సినిమాకు సంబంధించిన మిగతా అంశాలు వేగంగా కదులుతున్నాయి.

బిల్లా-2007లో బికినీలో కనిపించి తమిళనాడును మైమరిపిస్తున్న నయనతారకు భారీ బడ్జెట్ సినిమాలో అవకాశం లభించడం కలిసొచ్చిన అంశంగా చెప్పవచ్చు. బాలకృష్ణ ఒక్క మగాడు సినిమా సంక్రాంతికి విడుదల అవుతున్నది. మరోపక్క కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రంగా పాండురంగా సినిమా రూపుదిద్దుకుంటోంది. బహుషా ఈ సినిమా విడుదలైన తరువాత గుణశేఖర్ సాధు సినిమా ప్రారంభం కావచ్చు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X