»   » శేఖర్ కమ్ముల కోసం నయనతార రిస్క్!

శేఖర్ కమ్ముల కోసం నయనతార రిస్క్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హిందీలో సూపర్ హిట్ అయిన 'కహానీ' చిత్రానికి రీమేక్‌గా తెలుగులో 'అనామిక' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నయనతార ప్రధాన పాత్రలో నటిస్తోంది. తెలుగు, తమిళంలో ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈచిత్రం కోసం నయనతార కమిట్మెంటుతో పని చేస్తూ పలు రిస్కీ సీన్లు సైతం సొంతంగా చేస్తోంది.

దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ విషయాలపై మాట్లాడుతూ...'నయనతార ఈ సినిమా కోసం చాల కమిట్మెంటుతో పని చేస్తోంది. సినిమాలోకి తీసుకునే ముందు ఆమె నిబద్దతపై కొన్ని అనుమానాలు ఉండేవి. కానీ అవన్నీ అవాస్తవాలు అని నిరూపించింది' అని శేఖర్ కమ్ముల తెలిపారు.

షూటింగుకు సంబంధించిన ఓ సంఘటన గురించి శేఖర్ కమ్ముల గుర్తు చేసుకుంటూ...'షూటింగు మొదలయ్యే నాటికి ఆమె ఎంతో అందంగా గోళ్లు పెంచుకుని ఉంది. అయితే సినిమాలో క్యారెక్టర్ పరంగా అలాంటి పెద్ద గోళ్లు అవసరం లేదు. నేను ఈ విషయం ఆమెకు చెప్పగానే వెంటనే వాటిని కత్తిరించుకుంది. ఆమె కమిట్మెంట్ చూసి నేను ఎంతో ఆశ్చర్యపోయాను' అని తెలిపారు.

'సినిమాలో క్యారెక్టర్ పరంగా హీరోయిన్ ఓ రిస్కీ స్టంట్స్‌తో కూడిన సీన్లో పాల్గొనాల్సి వచ్చింది. ఆ సమయంలో మేము డూప్‌ను పెట్టి చేయించాలని అనుకున్నాం. కానీ నయనతార డూప్ అవసరం లేదు, తానే స్వయంగా చెస్తానని ముందుకు వచ్చింది. ఆమె ఎంతో కమిట్మెంటుతో పని చేయడం వల్లనే అనామిక సినిమా చాలా బాగా వచ్చింది' అని శేఖర్ కమ్ముల చెప్పుకొచ్చారు.

తెలుగులో ఈచిత్రాన్ని 'అనామిక' పేరుతో విడుదల చేస్తుండగా, తమిళంలో 'నీ ఎంగె ఎన్ అంబె' పేరుతో విడుదల చేస్తున్నారు. ఎండమోల్ ఇండియా, లాగ్ లైన్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

English summary

 Southern filmmaker Sekhar Kammula, who is currently working with actress Nayantara in bilingual Anamika, a Telugu and Tamil remake of Kahaani, is in awe of her commitment. The popular actress is so uncompromising that she even said no to a body double for a stunt sequence.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu