»   » సీత పేరు చెప్పి ప్రియుడు ప్రభుదేవాకు నయనతార ట్విస్టు

సీత పేరు చెప్పి ప్రియుడు ప్రభుదేవాకు నయనతార ట్విస్టు

Posted By:
Subscribe to Filmibeat Telugu

తాను నటిస్తున్న 'శ్రీరామరాజ్యం' సినిమాకోసం నయనతార చాలా జీవన శైలిలో,ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంది. సినిమాలో చేస్తున్న పాత్రమీద గౌరవంతో, భక్తితో కేవలం శాఖాహారం తీసుకోవటం మాత్రమే కాక ప్రియుడు ప్రభుదేవాను సైతం ప్రక్కన పెట్టేసింది. ప్రభుదేవాని తను ఉండే స్టార్ హోటల్ కి కాక కలవాలనుకుంటే లొకేషన్ లోనే కలవటానికి ప్రిఫర్ చేస్తోంది. ఇక ప్రభేదేవాకి ఫోన్ కాల్స్ కూడా తగ్గించేసింది. అంతేగాక ఆ పాత్ర కోసం ఆమె కేవలం హోమ్ మేడ్ ఫుడ్ ని మాత్రమే ఫ్రిఫర్ చేస్తోంది. ఆమె నియమ నిష్టలు చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా ప్రభుదేవా మొదట్లో ఛాదస్తం అంటూ విసుక్కున్నా ఆమె పద్దతికి,సిన్సియార్టీకి తల వంచక తప్పలేదంటున్నారు. బాపు దర్శకత్వంలో శ్రీ సాయిబాబా మూవీస్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో బాలకృష్ణ రామునిగా చేస్తున్నారు. లక్ష్మణుడుగా శ్రీకాంత్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో శరవేగంగా సాగుతోంది.

English summary
Actress Nayantara is on a strict vegetarian diet, having only home-made food during the shooting. Besides, she is not meeting Prabhu Deva during her shoots and is more or less cocooned in her five star hotel suite.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu