వలవేసి పట్టాలి అంటున్న నయనతార

By Srikanya

హైదరాబాద్ : నయనతార లాంటి హీరోయిన్ ఏం చెప్పినా సెన్షేషనే..ఆమె ఏం మాట్లాడినా అది వార్తే. తాజాగా ఆమె తన అభిరుచుల గురించి మీడియాతో మాట్లాడింది. తనకు చేపల కూరంటే చాలా ఇష్టమని, అదీ తను స్వయంగా పట్టుకున్న చేపలు అయితే మరీ ఇష్టమని చెప్పింది.

నయనతార మాట్లాడుతూ... "కేరళలో చేపల కూరను స్పెషల్‌గా చేస్తారు. పెరిగిందంతా నార్త్ ఇండియాలోనే అయినా నాకు కేరళ చేపల పులుసు వండటంలో మజా ఉంటుంది'' అని అంటోంది నయనతార.

అలాగే "చేపల కూర ఉంటే పుష్టిగా తినేస్తాను. చేపలతో చాలా వెరైటీలు చేస్తాను. వేసవి సెలవులకు కేరళ వెళ్లినప్పుడు వల వేసి చేపలు కూడా పట్టేదాన్ని. మనం వేసిన వలలో చేపలు పడితే ఆ జోష్‌ను మాటల్లో చెప్పలేం. చాలా ఆనందంగా ఉంటుంది'' అని వివరించింది.

ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న నయనతార తెలుగులో శేఖర్ కమ్ముల అనామిక చిత్రంలో చేస్తోంది. బాలీవుడ్ హిట్ కహాని రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. హిందీ తరహాలో తెలుగులోనూ మంచి విజయం సాధిస్తుందని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X