»   » చిరంజీవి 150వ సినిమాకు హీరోయిన్ ఖరారైంది!

చిరంజీవి 150వ సినిమాకు హీరోయిన్ ఖరారైంది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి నటించే 150వ సినిమా వివి వినాయక్ దర్శకత్వంలో రాబోతున్న సంగతి తెలిసిందే. తమిళంలో హిట్టయిన ‘కత్తి' చిత్రాన్ని తెలుగులో చిరంజీవి 150వ సినిమాగా రీమేక్ చేస్తున్నారు. తెలుగు నేటివిటీకి అనుగుణంగా స్క్రిప్టులో మార్పులు చేసారు వినాయక్.

ఇక ఈ సినిమాలో చిరంజీవి సరసన ఎవరు నటిస్తారు? అనేది చాలా కాలంగా హాట్ టాపిక్. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నయనతార హీరోయిన్ గా ఖరారైనట్లు సమాచారం. ఆమె అయితేనే చిరంజీవికి పర్ ఫెక్టుగా సెట్టవుతుందని భావిస్తున్నారట. ఫ్యాన్స్ కూడా నయనతార ఎంపికపై సంతృప్తిగానే ఉన్నారు.

Nayanthara being considered for Chiru 150th film

ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను చిరంజీవి తనయుడు, టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్వయంగా చేపట్టారు. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సహ నిర్మాణ సంస్థ వ్యవహరిస్తోంది. వివి వినాయక్ దర్శకత్వం వహించబోతున్న చిరంజీవి 150వ సినిమా త్వరలో ప్రారంభం కాబోతోంది.

తాజగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు చిరంజీవి తీసుకునే రెమ్యూనరేషన్ కూడా ఫిక్స్ అయినట్లు సమాచారం. రామ్ చరణ్, లైకా ప్రొడక్షన్స్ వారు ఈ విషయమై చర్చించి రూ. 30 కోట్లు ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఆల్రెడీ రూ. 15 కోట్ల అడ్వాన్స్ కూడా ఇచ్చారట. అయితే ఈ విషయమై అఫీషియల్ సమాచారం ఏమీ లేదు.

English summary
Chiranjeevi's 150th film being announced, the spotlight now turns onto the leading lady of the movie. If the buzz is to be believed, Nayanthara is being considered for the role.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu