For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Nayanthara: చిక్కుల్లో నయనతార, 'కనెక్ట్' చిత్రాన్ని రిలీజ్ చేయమని వార్నింగ్.. ఎందుకంటే?

  |

  దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమలో లేడి సూపర్​ స్టార్​గా పేరు తెచ్చుకుంది బ్యూటీఫుల్ హీరోయిన్​ నయనతార. సుమారు 17 ఏళ్లుగా సినీ రంగంలో విభిన్నమైన సినిమాలు చేస్తూ మాలీవుడ్​ టు టాలీవుడ్​ వయా కోలీవుడ్​ ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తూ వస్తోంది. ఇటీవల సరోగసి విధానం ద్వారా పిల్లలకు జన్మనిచ్చిన ఈ లేడీ సూపర్ స్టార్ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఆమె చేయించుకున్న సరోగసి పద్ధతి చట్టప్రకారం అన్ని నిబంధనలు పాటించిందో లేదో అని కమిటీ వేసి నిర్ణయించే వరకు వివాదం కొనసాగింది. అయితే ఇప్పుడు తాజాగా మరోసారి బ్యూటిఫుల్ నయనతార చిక్కుల్లో పడింది. ఆ వివరాల్లోకి వెళితే..

  సినిమాలకు దూరంగా..

  సినిమాలకు దూరంగా..

  నయనతార సినీ ఇండస్ట్రీకి వచ్చి దాదాపుగా 17 ఏళ్లు కావోస్తుంది. దక్షిణ చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందింది. తెలుగు, మలయాళ, తమిళ భాషల్లో చిత్రాలు చేసి సౌత్​ ఇండియా లేడి సూపర్​ స్టార్​గా స్టార్​డమ్​ సంపాందించుకుంది. ఇక తాజాగా ఆమె బాలీవుడ్​లో కూడా ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. ఇవే కాకుండా మరో రెండు సినిమాలకు సైన్ చేసిన నయన తార కోలీవుడ్ పాపులర్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ ను ప్రేమించి మహాబలేశ్వరంలో పెళ్లాడింది. ఇక పెళ్లి తర్వాత నయన తార సినిమాలకు దూరంగా ఉంటుందని టాక్ వినిపించింది. అయితే తర్వాత ఆమె గ్లామర్ పాత్రలు కాకుండా నటనకు ప్రాధాన్యత గల చిత్రాలతోపాటు సినిమాలను నిర్మించడం వంటి బాధ్యతలను చేపట్టనుందని మరికొన్ని వార్తలు వచ్చాయి.

   లేడీ ఒరియెంటెడ్ చిత్రాలపై..

  లేడీ ఒరియెంటెడ్ చిత్రాలపై..

  సౌత్ లేడీ సూపర్ స్టార్ గా కొనసాగుతోన్న హీరోయిన్ నయనతార తన భర్త విఘ్నేష్ శివన్ తో కలిసి సినిమాలు నిర్మిస్తోంది. నచ్చిన కథ దొరికితే వాటిని వెండితెరపై ఆవిష్కరించేందుకు సిద్ధమయ్యారు ఈ భార్యాభర్తలు. రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై సినిమాలను నిర్మిస్తున్న నయన తార పెళ్లి తర్వాత పూర్తిగా లేడీ ఒరియెంటెడ్ చిత్రాలపైనే ఫోకస్ పెడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా కనెక్ట్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానుంది నయన్. డైరెక్టర్ అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా చిత్ర ప్రదర్శనకు థియేటర్ ఓనర్లు నిరాకరించి మూవీ యూనిట్ కు షాక్ ఇచ్చారు.

  సమస్య తీసుకొచ్చిన ఇంటర్వెల్ కట్..

  సమస్య తీసుకొచ్చిన ఇంటర్వెల్ కట్..


  హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన కనెక్ట్ సినిమాను డిసెంబర్ 22న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే 99 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాను బ్రేక్ (ఇంటర్వెల్) లేకుండా ప్రదర్శిస్తామని నిర్మాత విఘ్నేష్ శివన్ గతంలో తెలిపాడు. ఇప్పుడు ఇదే ఆ సినిమాకు తంటాలు తెచ్చిపెట్టింది. ఇంటర్వెల్ లేకుండా ఈ సినిమా ప్రదర్శించేందుకు థియేటర్ ఓనర్స్ నిరాకరించారట. ఎందుకంటే బ్రేక్ లేకుండా సినిమా ఏకధాటిగా ప్రదర్శిస్తే ఇంటర్వెల్ లో ఫుడ్ కోర్ట్ నుంచి వచ్చే ఆదాయాన్ని థియేటర్ ఓనర్స్ నష్టపోతారని తెలుస్తోంది. ఈ కారణంతో కనెక్ట్ సినిమా రిలీజ్ విషయంలో థియేటర్స్ వెనుకాడుతున్నాయట. అయితే ఇంటర్వెల్ బ్రేక్ గురించి ముందుగా నిర్మాణ సంస్థ చెప్పలేదని.. సినిమా ప్రమోషన్స్ ద్వారానే తెలిసిందని థియేటర్ల యాజమాన్యం తెలిపిందట. ప్రస్తుతం నిర్మాణ సంస్థకు, థియేటర్ ఓనర్స్ కి మధ్య చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.

  English summary
  South Lady Superstar Nayanthara Connect Movie Get Into Controversy. Theatre Owners Against To Release Connect Over Without Interval.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X