twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    . ..ఇదొక మంచి పరిణామం : నయనతార

    By Srikanya
    |

    హైదరాబాద్ : ''చిత్ర పరిశ్రమలోకి నేను అడుగుపెట్టిన రోజులతో పోలిస్తే చాలా మార్పులు కనిపిస్తున్నాయి. అప్పట్లో వాణిజ్య చిత్రాల్లో మాత్రమే అవకాశం దొరికేది. పాటలు, డ్యాన్సులతోనే గడిచిపోయేది. ఇప్పుడు మాత్రం హీరోయిన్ ని కూడా దృష్టిలో పెట్టుకొని పాత్రల్ని తీర్చిదిద్దుతున్నారు. ఇదొక మంచి పరిణామం'' అని చెప్పుకొచ్చింది నయనతార.

    అలాగే ... ''కొన్నేళ్లుగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నాను. ఇప్పటికీ మూస పాత్రలకే పరిమితమైతే ప్రేక్షకులు ఏమాత్రం హర్షించరు. అందుకే కాస్త్తెనా కొత్తదనం ఉన్న కథలనే ఎంచుకొంటున్నాను''అని చెబుతోంది నయనతార. నటన ప్రదర్శించడానికి ఇప్పుడు చక్కటి అవకాశం లభిస్తోందని చెబుతోంది.

    ఇక నయనతార ప్రధాన పాత్రలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న చిత్రం 'అనామిక'. వయాకమ్‌ 18 మోషన్స్‌ పిక్చర్స్‌, ఎండెమోల్‌ ఇండియా, లాగ్‌లైన్‌ ప్రొడక్షన్స్‌ ప్రై.లిమిటెడ్‌, సెలెక్ట్‌ మీడియా హోల్డింగ్స్‌ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రాన్ని దసరా సందర్భంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని దర్శకుడు మీడియాకు తెలిపారు.

    శేఖర్‌ కమ్ముల మాట్లాడుతూ ''భర్తను వెతుక్కొంటూ ఓ యువతి హైదరాబాద్‌ నగరంలో చేసిన పోరాటమే ఈ సినిమా. ఆమె ప్రయత్నం ఫలించిందా లేదా అనేది కీలకాంశం. 'కహానీ' కథకు పలు మార్పులు చేసి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాం. దసరా సందర్భంగా సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాము''అన్నారు.

    నయనతార మాట్లాడుతూ ''స్త్రీ ప్రాధాన్యమున్న సినిమాలో నటించడం చాలా ఆనందాన్నిస్తోంది. అనామికగా కొత్త నయనతారని చూస్తారు. కహాని' సినిమాలో చాలా మార్పులు చేశారు. నా పాత్ర తీరుతెన్నులు కూడా మారాయి. నా శైలిలోనే నటించాను. ఎంత రీమేక్‌ అయినా మార్పులు, చేర్పులూ అవసరం. మక్కీకి మక్కీ తీస్తే చూడ్డానికి ఎవరూ సిద్ధంగా లేరు. ఒక వేళ అలాంటి కథలే నాముందుకు వస్తే అంగీకరించను. శేఖర్‌ శైలి తెలుసు కాబట్టి, ఆయన మార్పులు నచ్చాయి కాబట్టి 'కహాని' ఒప్పుకున్నా'' అన్నారు.

    ఈ ముద్దుగుమ్మ తెలుగులో 'అనామిక'తో పాటు గోపీచంద్‌తో ఓ చిత్రంలో నటిస్తోంది. తమిళంలో నాలుగైదు చిత్రాలు చేతిలో పెట్టుకొని హల్‌చల్‌ చేస్తోంది.

    English summary
    Nayanatara starrer Anaamika, being directed by Sekhar Kammula is getting ready to come to screens on Dussehra this year. Anaamika is the remake of Bollywood film Kahaani, which had Vidya Balan in the lead. Produced by Endemol India the film is getting ready in Tamil and Telugu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X