Just In
- 6 min ago
Naandhi Collections.. దుమ్ములేపిన అల్లరి నరేష్.. ఇప్పటి వరకు వచ్చిన లాభమెంతంటే?
- 27 min ago
తల్లి కాబోతోన్న ప్రభాస్ హీరోయిన్.. మొత్తానికి అలా గుడ్ న్యూస్ గుట్టు విప్పేసింది!
- 1 hr ago
నా ఫస్ట్ లవ్ నా హార్ట్ బ్రేక్.. అన్ని విషయాలు ఒకరికే తెలుసు.. గుట్టువిప్పిన సమంత
- 1 hr ago
Check 2nd day collections: నితిన్ మూవీ పరిస్థితి ఏమిటి? లాభాల్లోకి రావాలంటే..
Don't Miss!
- News
Illegal affair: పెళ్లానికి పులిహోరా, ఉంచుకున్న దానికి...... ?, భార్య బంగారం, డబ్బు !
- Sports
ప్చ్.. ఈసారి కూడా హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు లేవు!
- Finance
అమెరికాకు భారీగా అప్పులు, చైనా, జపాన్ నుండే ఎక్కువ: భారత్‌కు ఎంత చెల్లించాలంటే
- Automobiles
అతి తక్కువ ధరకే బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్.. పూర్తి వివరాలు
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు ఫిబ్రవరి 28 నుండి మార్చి 6వ తేదీ వరకు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కత్రినా కైఫ్ వ్యాపారానికి నయనతార అండ.. వీడియో పోస్ట్ చేసిన బాలీవుడ్ బ్యూటీ
ఉత్తరాది సినీ ఇండస్ట్రీ బాలీవుడ్‌ని ఏలుతూ వస్తోంది కత్రినా కైఫ్. గత కొన్నేళ్లుగా స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతూ ఓ స్టార్ హీరో కంటే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది. ఇక దక్షిణాది చిత్రసీమలో చూస్తే నయనతారదీ అదే పరిస్థితి. సౌత్ లేడీ సూపర్ స్టార్‌గా వరుస సినిమాలు చేస్తూ అలరిస్తోంది. కాగా తాజాగా బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ సౌత్ సూపర్ స్టార్ నయనతారకు కృతజ్ఞతలు చెప్పడం విశేషం.
సినిమా రంగంలో రాన్నిస్తూనే ప్రత్యేకంగా వ్యాపార రంగంపై ఫోకస్ పెడుతున్నారు నేటితరం హీరోహీరోయిన్లు. కత్రినా కూడా అదే బాటలో వెళుతోంది. సౌందర్య ఉత్పత్తుల రంగంలోకి అడుగుపెట్టి కే బై కత్రినా పేరుతో కొత్త వ్యాపారం ప్రారంభించింది కత్రినా కైఫ్. అయితే ఈ బ్రాండ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ప్రాచుర్యంలోకి తేవడానికై నయనతారతో కలిసి ఓ వీడియో రూపొందించింది కత్రినా. ఈ వీడియో షూట్ కోసం నయన్ ముంబై వెళ్లి వచ్చింది.

అయితే తాజాగా నయన్ ముంబై వచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది కత్రినా. సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ నా బ్రాండ్ ప్రమోషన్స్‌లో భాగంగా ముంబై వచ్చిన దక్షిణాది అందమైన తార నయనతారకు థ్యాంక్స్ అని పేర్కొంటూ సదరు వీడియో పోస్ట్ చేసింది.
View this post on InstagramA post shared by Katrina Kaif (@katrinakaif) on
కత్రినా కైఫ్ ప్రస్తుతం సూర్యవంశీ అనే చిత్రంలో నటిస్తోంది. ఇక ఇటీవలే చిరంజీవి సరసన సైరా నరసింహా రెడ్డి సినిమాలో నటించిన నయనతార.. ఈ శుక్రవారం రోజు 'విజిల్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అట్లీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో విజయ్ హీరోగా నటించాడు.