»   » పాపం... నయనతారకే ఎందుకు ఇలా జరుగుతోంది?

పాపం... నయనతారకే ఎందుకు ఇలా జరుగుతోంది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన వార్తలతో ఎప్పుడూ మీడియాలో హైలెట్ అవుతూ ఉంటుంది. ప్రభుదేవాతో నయనతార ప్రేమాయణం గురించి తెలిసిందే. దాదాపు పెళ్లి వరకు వచ్చిన వీరు చివరి నిమిషయంలో విడిపోయారు. ప్రభుదేవాతో విడిపోయిన తర్వాత సినిమాల్లో బిజీ అయిపోయింది నయనతార.

'నానుం రౌడీ దాన్‌' చిత్రంలో నటించిన నయనతార ఈ చిత్ర దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ప్రేమలో పడిందని, ఆ మధ్య వీరికి రహస్యంగా వివాహం జరిగినట్లు కూడా వార్తలు వెలువడ్డాయి. అయితే ఇద్దరూ ఈ వార్తలను ఖండించారు. పెళ్లి విషయం ఖండించినా ఇద్దరి మధ్య లవ్ ఎఫైర్ ఉందనే ప్రచారం జరిగింది.

గతంలో శింబు, ప్రభుదేవాలతో ప్రేమ వ్యవహారంలో నయనతారకు కొన్ని షాకింగ్ అనుభవాలు ఎదురయ్యాయి. అందుకే విఘ్నేష్ శివన్ ప్రేమ వ్యవహారం విషయంలో ఆమె గోప్యత పాటిస్తోందని నిన్నమొన్నటి వరకు వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఇద్దరికి బ్రేకప్ అయినట్లు తమిళ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

సౌత్ లో ఇప్పటి వరకు ఏ హీరోయిన్ కూడా నయనతార లాంటి పరిస్థితి ఎదుర్కోలేదు. నయనతారకు ఎందుకనో ఈ ప్రేమ వ్యవహారాలు అచ్చిరావడం లేదు. పాపం ఆమె విషయంలోనే ఎందుకు ఇలా జరుగుతుందో? అంటూ ఆమె పరిస్థితి చూసి కొందరు జాలి పడుతున్నారు.

నయన-విఘ్నేష్

నయన-విఘ్నేష్

నయనతార, విఘ్నేష్ శివన్ మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని గత కొంతకాలంగా వార్తలు విపిస్తున్నాయి.

 బయట పడలేదు

బయట పడలేదు

అయితే ఈ విషయాన్ని ఇద్దరూ ఎప్పుడూ కూడా ఖరారు చేయక పోవడంతో అదో రూమర్ గానే మిగిలిపోయింది.

అలా క్లోజ్ అయింది

అలా క్లోజ్ అయింది

'నానుం రౌడీ దాన్‌' చిత్రంలో నటించిన నయనతార ఈ క్రమంలో దర్శకుడికి క్లోజ్ అయిందట.

పెళ్లి?

పెళ్లి?

ఆ మధ్య వీరికి రహస్యంగా వివాహం జరిగినట్లు కూడా వార్తలు వెలువడ్డాయి. అయితే ఇద్దరూ ఈ వార్తలను ఖండించారు.

అప్పుడే..

అప్పుడే..

ఇద్దరూ 2016 వివాహం చేసుకుంటారని అనుకున్నారు... అంతలోనే బ్రేకప్ అయినట్లు వార్తలు వచ్చాయి.

English summary
Tamil film source said that, actress Nayanthara Break Up With Vignesh.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu