త్రిషతో కలిసి పార్టీ చేసుకున్న నయనతార (ఫోటో)

By Bojja Kumar

హైదరాబాద్ : సౌతిండియా స్టార్ హీరోయిన్ నయనతార మరోసారి వార్తల్లో వ్యక్తిగా మారారు. 2012లో నయనతార, మరో స్టార్ హీరోయిన్ త్రిష మధ్య విబేధాలు పొడచూపాయి. అప్పట్లో వీరి మధ్య ఓ రేంజిలో కాంపిటీషన్ ఉండటమే అందుకు కారణం. తాజాగా వీరిద్దరూ మళ్లీ కలిసారు.

Nayanthara and Trisha

నయనతార, త్రిష ఇద్దరూ కలిసి తాజాగా ఓ పార్టీలో పాల్గొన్నారు. ఈ విషయాన్ని త్రిష తన ట్విట్టర్ ద్వారా వెల్లడించడంతో పాటు ఫోటో కూడా పోస్టు చేసింది. మళ్లీ నయనతారతో కలవడం ఆనందం ఉందంటూ ట్వీట్ చేయడంతో పాటు ఇద్దరూ మంగళవారం రాత్రి పార్టీలో పాల్గొన్న ఫోటోను కూడా పోస్టు చేసింది.

నయనతార గత కొంత కాలంగా మీడియాకు దూరంగా ఉంటున్నారు. పలువురు హీరోలతో తనకు ఉన్న సంబంధాలపై మీడియా వారు గుచ్చి గుచ్చి అడుగు తుండటమే అందుకు కారణం. దీంతో మీడియాకు దూరంగా ఉంటూ స్నేహితులకు దగ్గరవుతోంది ఈ హాట్ బ్యూటీ.

ఇటీవల నయనతార ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మాట్లాడుతూ...'ప్రస్తుతం తాను సింగిల్‌గా ఉన్నాను. ఇప్పుడు నాకు ఎలాంటి సమస్యలు లేవు. మీడియాలో వస్తున్న వార్తలతో చాలా విసుగు చెందాను' అని వెల్లడించారు. ప్రస్తుతం నయన తార పలు సినిమాలతో బిజీగా గడుపుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X