»   » బాలయ్యకి తల్లిగా నయన తార?: బాలకృష్ణ 102 లో నయన్ రోల్ గురించి తెలుసా?

బాలయ్యకి తల్లిగా నయన తార?: బాలకృష్ణ 102 లో నయన్ రోల్ గురించి తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇంతకుముందు ఈ జంట సింహ, శ్రీ రామరాజ్యం సినిమాల్లో సందడి చేసి ప్రేక్షకులని అలరించిన సంగతి తెలిసిందే. ముచ్చటగా మూడోసారి కె.ఎస్. రవికుమార్ దర్శకత్వం వహించే సినిమా లో వీరిద్దరూ కలిసి నటించేందుకు కాల్షీట్లు రెడీ చేస్తున్నారు. శ్రీరామరాజ్యం చిత్రంలో సీతగా బాలయ్య సరసన నటించిన నయన్‌, బాలయ్య 102వ చిత్రంలో లీడ్‌ రోల్‌ పోషిస్తోందట.

బాలకృష్ణ 102వ సినిమా కేఎస్ రవికుమార్ డైరక్షన్ లో చకచకా ముస్తాబైపోతోంది. రామోజీ ఫిలిం సిటీలో ఏకబిగిన షూటింగ్ చేస్తున్నారు. అయితే అసలు లేటెస్ట్ ఇన్ ఫర్ మేషన్ ఏమిటంటే, ఈ సినిమాలో నయనతార మెయిన్ హీరోయిన్ కాదు.

Nayanthara to play mother role in NBK 102

వేరే మరో ఇద్దరు హీరోయిన్లు వుంటారు. సినిమాలోని కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఏపిసోడ్ లో నయన తార సీనియర్ బాలయ్య భార్యగా కనిపిస్తుంది. అది కాక జూనియర్ బాలయ్య సరసన ఇద్దరు హీరోయిన్లు వుంటారుబాలయ్యకి తల్లిగా నటిస్తోందని సినీవర్గాల సమాచారం. కోలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న నయనతార ఈ చిత్రానికి డేట్స్ ఇవ్వడానికి కారణం బాలయ్య అని తెలుస్తోంది.

నయన ను లక్కీ హీరోయిన్ గా భావించిన బాలయ్య స్వయంగా ఆమెకు కాల్ చేసి తన సినిమాలో నటించమని కోరాడట. దీంతో నయన కూడా పాజిటివ్ గానే స్పందించినట్టు తెలుస్తోంది.మరోవైపేమో చిరంజీవి 151వ సినిమాకి నయన్‌నే హీరోయిన్‌గా ఎంపిక చేసుకుంది చిత్ర యూనిట్ . మరి బాలయ్యకి తల్లిగా నయన్‌ ఎలా కనిపిస్తుందో లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ అంటున్నాయి సినీవర్గాలు.

English summary
Nayanthara is not the heroine of the film NBK 102. She is going to play the role of wife to a crucial character and will be seen essaying Balayya’s mother.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu