»   » ఆ మూడూ ఉంటే సినిమా చేయను: నయన్ కండిషన్లు

ఆ మూడూ ఉంటే సినిమా చేయను: నయన్ కండిషన్లు

Posted By:
Subscribe to Filmibeat Telugu

నయన్... నయన తార...సౌతిండియా సినీ పరిశ్రమల్లోనే ఒక ఫైర్బ్రాండ్ కం టాప్ రేంజ్ హీరోయిన్. రూమర్లూ, ఎఫైర్లూ, నిర్మాతల ఒత్తిళ్ళు అన్నిటినీ తటుకొని దాదాపుగా ఒక సందర్భం లో తెరకి దూరం జరిగి కూడా ఇప్పుడు ఖరాఖండి గా నాకు మూడు కోట్లు ఇవ్వండీ అనిడగగల "లేడీ దబాంగ్". ఈ బ్యూటీ ఎప్పుడూ ఏవరో ఒకరితో లవ్ బిజీగా ఉంటుంది.

ఎఫైర్స్ పరంగా ఈ బ్యూటీ ఎప్పుడు హాట్ టాపిక్ గా మారుతుంది. కానీ పెళ్లి మ్యాటర్ లో నయన్ కి కాలం కలిసి రావడం లేదు. శింబుని పెళ్లి చేసుకుందాం అనుకుంటే బెడిసికొట్టింది. ఇక ముగ్గరు పిల్లలకు తండ్రి అయిన ప్రభుదేవాను పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ ఆ ప్లాన్ కూడా వర్కవుట్ కాలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళ దర్శకుడు విఘ్నేష్ తో మరోసారి ప్రేమయాణం సాగిస్తుంది.సాధారణంగా సినీ పరిశ్రమలో నటీనటులకు దర్శకులు కండిషన్లు పెడుతుంటారు. అయితే అగ్రతారల విషయంలో మాత్రం దర్శకులే కండిషన్లకు అంగీకరించాల్సిన పరిస్ధితి. తాజాగా దక్షిణాది టాప్‌ హీరోయిన్ నయనతార కొత్త కొత్త కండిషన్లతో దర్శకుల్ని బెంబేలెత్తిస్తోందట.

Nayanthara's 3 condition to sign a movie

సంపాదించిన కొద్దీ ఒక్కొక్క కండిషన్‌ను నేర్చుకొని మరీ పాటిస్తోంది. ఓ వైపు ఎక్స్‌పోజింగ్ చేస్తూనే మళ్లీ కాల్షీట్స్ కోసం వెళ్లినవారితో 'కండిషన్స్ అప్లై' అంటోందట. ఆ కండిషన్లు ఎప్పటికప్పుడు మారిపోతూనే వుంటాయన్నది వేరే విషయం. గ్లామరస్‌గా కనిపించాలనీ, మాస్ ఆడియన్లకు నచ్చేట్టుగా ఎక్స్‌పోజింగ్ చేయాలని అడిగితే మాత్రం కుదరదంటోంది. తాజాగా ఇటువంటి కండిషన్లు కూడా తనకున్నాయని చెబుతోందట. ఇటీవల ఓ బిగ్‌స్టార్ సరసన ఆమె కాల్షీట్ కోసం వెళితే ఈ కండిషన్లన్నీ ఏకరువు పెట్టిందట. తాను చెప్పిన మాట ఒక్కటి పాటించకపోయినా మళ్లీ వేరే కండిషన్లు ఉంటాయనీ హెచ్చరిస్తోందట.


కథ, సీన్, బై సీన్ చెప్పడమే కాకుండా, ప్రధాన సన్నివేశాల్లో డైలాగులు కూడా చెప్పాలని ఇప్పటికే నయన్ కండిషన్ పెట్టింది. ఇప్పుడు మరో మూడు కండిషన్లు ఈ జాబితాలో చేరాయి. ఎట్టి పరిస్ధితుల్లోను లిప్‌ లాక్‌ సీన్స్‌లో, బాత్రూమ్‌ సన్నివేశాల్లో, శృంగార సన్నివేశాల్లో నటించనని నయనతార ఖచ్చితంగా చెబుతోందట. ప్రధానంగా 'ఇరుముగన్' తరువాత నయన్ ఈ కండిషన్లను తప్పనిసరి చేసిందట. మామూలుగా షూటింగ్‌ పూర్తయిన తరువాత ఎడిటింగ్‌ కట్‌ చేయడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే నయనతార కథ చెప్పేటప్పుడే ఆ సీన్లకు కత్తిరేస్తుందని కోలీవుడ్‌లో చెప్పుకుంటున్నారు

English summary
Nayan's first condition is she won’t act in any Lip lock scenes. Second one is, no bathing scenes and final one is she won’t show any of her body parts. Which means she is only ready for family homely subjects? She only accepts scripts that, fall with this conditions.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu