»   »  నయనతార చెంప పగలకొట్టాడు

నయనతార చెంప పగలకొట్టాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'అనామిక'. హిందీలో విజయవంతమైన 'కహానీ' సినిమా ఆధారంగా రూపొందుతోంది. ఈ చిత్రంలో పశుపతి ఆమెకు కన్నీళ్లు వచ్చేలా చెంప పగలకొట్టాడు. ఆ విషయం స్వయంగా యూనిట్ సభ్యులే చెప్తున్నారు. అక్కడ విద్యాబాలన్‌ పోషించిన పాత్రలో ఇక్కడ నయనతార నటిస్తోంది. వైభవ్‌, హర్షవర్ధన్‌ రాణే కీలక పాత్రలు పోషిస్తున్నారు. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. ఎండమోల్‌ ఇండియా, లాంగ్‌లైన్‌ ప్రొడక్షన్స్‌, సెలెక్ట్‌ మీడియా హోల్డింగ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

సీన్ విషయంలో కి వెళితే...సినిమాలో ఓ పోలీస్‌స్టేషన్ సీన్...పశుపతి ఇన్‌స్పెక్టర్ పాత్రను చేస్తున్నాడు. సీన్ పూర్తయింది. కానీ దర్శకుడు శేఖర్‌కమ్ములలో ఏదో అసంతప్తి. ఆయనకు, పశుపతికి మధ్య సెట్‌లో ఏదో సీరియస్ చర్చ నడుస్తోంది. మానిటర్‌లో ఓ సీన్‌ని పదేపదే రిపీట్ చేస్తూ చూస్తున్నారు. వాళ్లేం మాట్లాడుకుంటున్నారో తెలుసుకుందామని నయనతార అక్కడికి వెళ్లింది. పోలీస్ ఇన్‌స్పెక్టర్ పాత్ర చేస్తున్న పశుపతి..నయనతారను చెంపదెబ్బ కొట్టే సన్నివేశాన్ని శేఖర్‌కమ్ముల పదేపదే చూస్తున్నాడు. ఆ సీన్ అంతగా పండలేదని నయనతారకు అర్థమైంది. ఆమె వెంటనే పశుపతితో నిజంగానే చెంపదెబ్బ కొట్టించండి. బాధనిపించినా ఫర్వాలేదు. సీన్ పండాలంటే తప్పదుమరి అని చెప్పింది. ఆమె చెప్పినట్లుగానే ఆ సీన్ రీషూట్ చేశారు. పశుపతి బలంగా నయనతార చెంపమీద కొట్టాడు. ఆమె బాధను బిగపట్టుకుంది. సీన్ అద్భుతంగా వచ్చిందని యూనిట్ అంతా ప్రశసించారు.

Nayanthara's AnamiKa latest info.

నయనతార మాట్లాడుతూ ''స్త్రీ ప్రాధాన్యమున్న సినిమాలో నటించడం చాలా ఆనందాన్నిస్తోంది. అనామికగా కొత్త నయనతారని చూస్తారు. కహాని' సినిమాలో చాలా మార్పులు చేశారు. నా పాత్ర తీరుతెన్నులు కూడా మారాయి. నా శైలిలోనే నటించాను. ఎంత రీమేక్‌ అయినా మార్పులు, చేర్పులూ అవసరం. మక్కీకి మక్కీ తీస్తే చూడ్డానికి ఎవరూ సిద్ధంగా లేరు. ఒక వేళ అలాంటి కథలే నాముందుకు వస్తే అంగీకరించను. శేఖర్‌ శైలి తెలుసు కాబట్టి, ఆయన మార్పులు నచ్చాయి కాబట్టి 'కహాని' ఒప్పుకున్నా'' అన్నారు.

అలాగే...నా దృష్టిలో ఇదొక ప్రత్యేకమైన చిత్రం. 'కహానీ' ఆధారంగా రూపొందుతున్న చిత్రమే అయినా... రెండింటిమధ్య ఏమాత్రం పోలికలు కనిపించవు. మన వాతావరణానికి తగ్గట్టుగా కథలో పూర్తిస్థాయిలో మార్పులు చేశారు శేఖర్‌ కమ్ముల. విద్యాబాలన్‌ పోషించిన పాత్రతో నా పాత్రని ఎవ్వరూ పోల్చి చూసుకోలేరు. అంత వైవిధ్యంగా ఉంటుంది. అందరినీ ఆకట్టుకొనే ఓ మంచి చిత్రమవుతుంది అంటూ నయనతార చెప్పుకొచ్చింది.


శేఖర్‌ కమ్ముల మాట్లాడుతూ ''భర్తను వెతుక్కొంటూ ఓ యువతి హైదరాబాద్‌ నగరంలో చేసిన పోరాటమే ఈ సినిమా. ఆమె ప్రయత్నం ఫలించిందా లేదా అనేది కీలకాంశం. 'కహానీ' కథకు పలు మార్పులు చేసి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాం. ''అన్నారు. ఎమ్‌.ఎమ్‌.కీరవాణి ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు. కీరవాణితో పని చేయడం శేఖర్‌కి ఇదే ప్రథమం. అనామిక చిత్రీకరణ హైదరాబాద్‌ పరిసరాల్లో సాగుతోంది. ఈ చిత్రంలో వైభవ్‌ పోలీసు కానిస్టేబుల్‌ పాత్రను పోషిస్తున్నారు. ఈ కథలో కీలకమైన పాత్ర ఇది.

''పెళ్త్లెన ఓ మహిళ నేపథ్యంలో సాగే కథ ఇది. ఆమె ఎవరి కోసం అన్వేషణ ప్రారంభించింది? జీవితంలో ఎలాంటి ఆటుపోట్లను ఎదుర్కొంది? అనే విషయాలు ఆసక్తికరం. ఎం.ఎం.కీరవాణి స్వరాలు చిత్రానికి బలాన్నిస్తాయి''అని నిర్మాత చెబుతున్నాయి. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: విజయ్‌ సి.కుమార్‌.

English summary
Sekhar Kammula’s venerated project ‘Anamika is getting ready to hit the screens soon. The film maker has earlier planned so many dates for the release but the conditions were not very viable. It is a re-make of super hit hindi film ‘Kahaani’ and Nayantara is playing the title role in this re-make film, Vaibhav will be seen as police officer. Yandamuri Veerendra Nath has penned the dialogues and Keeravani is scoring music. Long Reel production banner is producing this bilingual film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu