»   » దెయ్యం కారు మీదగ్గరకి వచ్చేదెపుడో తెలుసా..? "డోర" రిలీజ్ డేట్ ఇదే

దెయ్యం కారు మీదగ్గరకి వచ్చేదెపుడో తెలుసా..? "డోర" రిలీజ్ డేట్ ఇదే

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ కథానాయిక నయనతార ప్రధాన పాత్రలో తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్న మహిళా ప్రధాన చిత్రం డోర. సినీ పరిశ్రమలోకి వచ్చి ఏళ్లు గడుస్తున్న కొద్దీ విజయాలు అందుకుంటూ మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతోంది కేరళకుట్టి నయనతార. ఇటీవల హర్రర్‌, థ్రిల్లర్‌ కథాంశంతో రూపుదిద్దుకున్న 'మాయ'లో తన నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది.

ఇప్పుడు అదే తరహాలోని దెయ్యం కథతో రూపొందుతున్న 'డోరా'లో ఆమె నటిస్తోంది. దర్శకుడు సర్గుణం ఈ చిత్రానికి నిర్మాత. ఆయన సహాయకుడు దాస్‌ రామస్వామి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా పతాకంపై మల్కాపురం శివకుమార్ తెలుగులో నిర్మిస్తున్నారు. వివేక్, మెర్విన్ సంగీతాన్నందించిన ఈ చిత్ర గీతాలు ఇటీవల విడుదలయ్యాయి. ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం మార్చి 31 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Nayanthara's Dora Movie to release on March 31

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ఇటీవల విడుదలైన ఆడియోకు చక్కటి స్పందన వస్తోంది. పాటలన్నీ అర్థవంతమైన సాహిత్యంతో ట్రెండీగా వున్నాయని ప్రశంసలు లభిస్తున్నాయి. కారులో దెయ్యం అనే థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నవ్యమైన కథతో, ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లేతో ఆద్యంత.. ఉత్కంఠను పంచే విధంగా చిత్రంలోని సన్నివేశాలు వుంటాయి.

ఇక నయనతార అంటేనే చక్కటి అభినయానికి పెట్టింది పేరు. ఆమెకు అగ్రహీరోలతో సమానమైన ఇమేజ్ వుంది. దక్షిణాది కథానాయికల్లో నయనతార సూపర్‌స్టార్. అత్యుత్తమ నిర్మాణ విలువలతో డోరా సినిమాను తెరకెక్కించాం. మయూరి తరహాలో ఈ సినిమాతో నయనతార మరోసారి విజయాన్ని సొంతం చేసుకుంటుంది. తెలుగు, తమిళ భాషల్లో మార్చి 31 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.. అని తెలిపారు.

English summary
Nayanthara’s Dora is all set to release on March 31. Touted to be a fantasy horror thriller, Nayanthara’s character name in the film in Pavalakodi and Thambi Ramaiah plays her dad in the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu