»   » ట్రైలర్ టాక్ : బోరు బావిలో చిన్నారి..అడ్డుకునే వారికి నయనతార సవాల్!

ట్రైలర్ టాక్ : బోరు బావిలో చిన్నారి..అడ్డుకునే వారికి నయనతార సవాల్!

Subscribe to Filmibeat Telugu
ట్రైలర్ టాక్ : బోరు బావిలో చిన్నారి..అడ్డుకునే వారికి నయనతార సవాల్!

నయనతార సోలో హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం కర్తవ్యం. ఈ చిత్రంలో నయనతార పవర్ ఫుల్ రోల్ లో కనిపించబోతోంది. నయనతార ఇండస్ట్రీకి దశాబ్దకాలం గడుస్తున్నా హీరోయిన్లలో టాప్ లీగ్ లో కొనసాగుతోంది. తాజగా కర్తవ్యం చిత్ర ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ చిత్రం మార్చ్ 16 న విడుదలకు సిద్ధం అవుతోంది.

బోరు బావిలో ఓ చిన్నారి పడిపోవడం, ఆ చిన్నారిని వెలికి తీయడంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించడం వంటి సన్నివేశాలతో ఈ చిత్రం ఉండబోతున్నట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. బోరు బావిలో పడిపోయిన చిన్నారి కోసం నయనతార ఏం చేసిందనేది ఈ చిత్ర కథ. టైలర్ చివర్లో నయన్ చెప్పే డైలాగ్ ఆకట్టుకునే విధంగా ఉంది. నన్ను ఎవ్వరు అడ్డుకోవాలని ప్రయత్నించినా నా కర్తవ్యం నేను నిర్వర్తిస్తాను అంటూ నయన్ డైలాగ్ చెబుతోంది. నయన్ సోలో హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

English summary
Nayanthara's Karthavyam movie trailer released. Karthavyam will going to release on March 16th
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu