»   » కర్తవ్యం: నయనతార నటవిశ్వరూపం చూడబోతున్నాం...

కర్తవ్యం: నయనతార నటవిశ్వరూపం చూడబోతున్నాం...

Posted By:
Subscribe to Filmibeat Telugu

నయనతార ప్రధాన పాత్రలో తమిళంలో ట్రైడెంట్ ఆర్ట్స్ సంస్థ నిర్మించిన 'ఆరమ్' సూపర్ హిట్ కావడంతో ఈ చిత్రాన్ని తెలుగులో 'కర్తవ్యం' పేరుతో విడుదల చేస్తున్నారు. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఆర్ రవీంద్రన్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ అధినేత శరత్ మరార్ సంయుక్తం ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు.

అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని మార్చి 16న 'కర్తవ్యం' మూవీని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మహిళా దినోత్స‌వం సంద‌ర్బంగా ఫస్ట్‌లుక్ టీజ‌ర్ విడుద‌ల చేసారు.

Nayanthara's Karthavyam's to release on March 16

నిర్మాత‌లు మాట్లాడుతూ ఈ సినిమా తెలుగు లో కూడా మంచి విజయం సాధిస్తుంది అని నమ్మకం ఉందన్నారు. నిత్యం మ‌నం న్యూస్ ఛాన‌ల్ లో చూస్తున్న బోరు భావిలో ఆడుకుంటున్న పిల్ల‌లు ప‌డిపోతే, అక్కడ జ‌రుగుతున్న ఆప‌రేష‌న్ క‌థా వ‌స్తువుగా తీసుకుని రియ‌లిస్టిక్ గా బాగా ద‌గ్గ‌ర‌గా ప్ర‌తి ఓక్క‌రి హృదయం త‌డిసేలా అద్బుత‌మైన‌ నేరేష‌న్ తో ద‌ర్శ‌కుడు గోపి నైన‌ర్ తెర‌కెక్కించాడరని తెలిపారు.

ఈ చిత్రంలో నయనతార స్పెష‌ల్ ఆఫీస‌ర్(క‌లెక్ట‌ర్) పాత్ర‌లో తన న‌ట‌విశ్వ‌రూపం చూపించారని, ఈ చిత్రం త‌మిళం లో సూప‌ర్‌హిట్ కావ‌ట‌మే కాకుండా తెలుగు ప్రేక్ష‌కుల్లో ఎప్పుడూ చూద్దామా అనే ఆసక్తి అందరిలోనూ కలిగించిందని తెలిపారు.

ఈ చిత్రంలో నయనతార, విగ్నేష్, రమేష్, సును లక్ష్మి , వినోదిని వైద్యనాథన్, రామచంద్రన్ దురైరాజ్, ఆనంద్ కృష్ణన్ నటిస్తున్నారు. కెమెరా : ఓం ప్రకాష్, మ్యూజిక్ : జీబ్రాన్, ఎడిటింగ్ : గోపి కృష్ణ, కథ దర్శకత్యం : గోపి నైనర్, నిర్మాత : శ‌ర‌త్ మ‌రార్‌, ఆర్ రవీంద్రన్ .

English summary
Nayanthara starrer Aramm, directed by Gopi Nainar is back. The Telugu dubbed version of the movie, titled Karthavyam is all set to release on March 16 in Telengana and Andhra Pradesh.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu