»   » డోర....నయనతార మళ్లీ భయపెట్టడానికొస్తోంది! (ఫస్ట్ లుక్)

డోర....నయనతార మళ్లీ భయపెట్టడానికొస్తోంది! (ఫస్ట్ లుక్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నయనతార కెరీర్ తొలి నాళ్లల నుండే గ్లామర్ గా కనిపించే పాత్రలు చేయడం మొదలు పెట్టింది. తర్వాత ఆమె కొన్ని లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తే నయనతార ఇలాంటివి కూడా చేయగలదా అంటూ ఆశ్చర్యపోయారు. తర్వాత రామానయణం చిత్రంలో సీత పాత్రలో అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ చూపెట్టింది.

ఆ మధ్య వచ్చిన 'మాయ' చిత్రంతో హారర్ సినిమాల విషయంలోనూ తాను ఏ మాత్రం తీసిపోను అని నిరూపించుకుంది ఈ కేరళ బ్యూటీ. తాజాగా మరోసారి ప్రేక్షకులను, అభిమానులను భయపెట్టడానికి సిద్ధమవుతోంది నయనతార.

Nayanthara's next film Dora first look in telugu

'కలవాని', 'వాగైసూడవా' తదితర చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సర్గుణం. ఇప్పుడు ఆయన స్వీయ నిర్మాణంలో దాస్‌ రామస్వామి దర్శకుడిగా 'డోరా' రూపొందుతోంది. ఇందులో నయన్‌ కీలకపాత్ర పోషిస్తోంది. హర్రర్‌ కథాంశంతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

ఫస్ట్‌లుక్‌ను ఇటీవల విడుదల చేశారు. అందులో ఆకాశం వైపు నయనతార చూస్తున్నట్టు.. ఓ భూతం రూపంలో మేఘం ఉన్నట్లు చూపారు. 'మాయ' తరహాలో దెయ్యం సినిమాగా ఇది ఉంటుందని ఫస్ట్‌లుక్‌ చూసిన వారు భావిస్తున్నారు.

English summary
Post the massive success of her horror thriller Maya, actress Nayantara has started shooting for yet another thriller with director Sargunam's long-time assistant Doss Ramasamy. Titled Dora, the film will have a car in an important role--something like a haunted one.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu