»   » కాంట్రవర్సీ: నయనతార చేతిలో బీర్ బాటిల్ (ఫోటోస్)

కాంట్రవర్సీ: నయనతార చేతిలో బీర్ బాటిల్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ నయనతార నటిస్తున్న ‘తిరునాళ్' అనే తమిళ చిత్రానికి సంబంధించిన ఫోటోల్లో ఆమె బీర్ బాటిల్ పట్టుకుని ఉండటం వివాదాస్పదం అయింది. అయితే ఈ వివిదం సినిమాకు పబ్లిసిటీ పరంగా కలిసొస్తుందని భావిస్తున్నారు. సినిమాలోని ఓ సీన్లో ఆమె ప్రయాణిస్తున్న వాహనంపై బీర్ బాటిల్ విసిరే సీన్ ఉందని తెలుస్తోంది.

Nayanthara spotted holding beer!

గతంలో కూడా నయనతార రోడ్డుపై ఉన్న షాపులో బీరు కొనే వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. నయనతార అలా రోడ్డుపై బీర్ కొనే సీన్ చూసి చాలా మంది షాకయ్యారు. అయితే అది ఆమె నటించిన ‘నానుమ్ రౌడీ ధాన్' సినిమాలోని సీన్ అని తెలియడంతో ఆశ్చర్యపోయారు.

హీరో జీవా, నయనతార జంటగా తమిళంలో తెరకెక్కుతున్న చిత్రం ‘తిరునాళ్'. ఈ చిత్రానికి పీఎస్.రామనాథ్ దర్శకత్వం వహిస్తుండగా ఎం.సెంథిల్ కుమార్ నిర్మిస్తున్నారు. రాజకీయం, రౌడీయిజం అంశాల మేళవింపుతో ఓ స్కాం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది.

Nayanthara spotted holding beer!

ఈ చిత్రంలో జీవా ఫుల్ మాస్ క్యారెక్టర్లో కనిపించబోతున్నాడు. అదుకు తగిన విధంగా సినిమాలో జీవా లుక్ కనిపించబోతోంది. ఇందులో ఆయన పాత్ర పేరు బ్లేడ్. ఓ రౌడీ. తరచూ నోట్లోంచి బ్లేడు తీస్తుంటాడు. ఇందులో బ్లేడు ప్రియురాలిగా నటిస్తున్న నయనతార కూడా ఓ సన్నివేశంలో నోట్లోంచి బ్లేడు తీస్తుందట.

ఇప్పటికే విడుదలైన ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. లంగా ఓనీలో నయనతార పల్లెటూరి అమ్మాయి లుక్ ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ సినిమా ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతుందని, సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని అంటున్నాడు నిర్మాత సెంథిల్ కుమార్. తన నెక్ట్స్ మూవీ కూడా ఈ ఇద్దరు జంటగా చేయనున్నట్లు తెలిపారు.

English summary
Nayanthara holding beer bottle in her upcoming movie, is again leading to fresh controversy. Regardless of the controversies, Nayanthara is constantly building up her career. In fact, she is treating those controversies as a free publicity, and thus gaining big films.
Please Wait while comments are loading...