»   » ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ :రాస్తారోకో, ఆందోళనకు దిగిన బాలకృష్ణ అభిమానులు

‘గౌతమిపుత్ర శాతకర్ణి’ :రాస్తారోకో, ఆందోళనకు దిగిన బాలకృష్ణ అభిమానులు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు గురువారం బ్రహ్మాండగా విడుదల కానున్న నందమూరి బాలకృష్ణ 'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రం బెనిఫెట్ షోల విషయంలో వివాదం ఏర్పడింది. దాంతో కూకట్‌పల్లిలో బాలకృష్ణ అభిమానులు ఆందోళనకు దిగారు. 'గౌతమిపుత్ర శాతకర్ణి' బెనిఫిట్‌ షోకు అనుమతివ్వాలని డిమాండ్‌ చేస్తూ భ్రమరాంబ ధియోటర్ వద్ద రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. భారీస్థాయిలో వాహనాలు నిలిచిపోయాయి.

ఇక ఆంధ్రప్రదేశ్ లోనూ ఇదే పరిస్దితి నెలకొంది. బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి బెనిఫిట్ షోలకు అనుమతి లేదని పోలీసులు చెప్పారు. అర్ధరాత్రి సినిమాల వల్ల ట్రాఫిక్ సమస్యలు వస్తాయని పోలీసులు అంటున్నారు. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి బెనిఫిట్ షోలకు అనుమతిచ్చారు.


మరో ప్రక్క ఈ చిత్రానికి వినోదపు పన్ను రాయితీపై హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఆ చిత్రానికి ఏపీ ప్రభుత్వం వినోదపు పన్ను రాయితీ ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ ఈ పిటిషన్‌ వేశారు. అయితే ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు హైకోర్టు నిరాకరించింది. అంతేకాకుండా సంక్రాంతి సెలవుల తర్వాత విచారణ జరుపుతామని స్పష్టంచేసింది.


NBK Fans Dharna at Bramarambha Theater in Kukatpally!

బాలకృష్ణ మాట్లాడుతూ...తాను నటించిన తాజా చిత్రం "గౌతమిపుత్ర శాతకర్ణి" పంచభక్ష్యపరమాన్నాలతో కూడిన విందుభోజనంలా ఉంటుందని అన్నారు. ప్రజాసంక్షేమమే పరమావధిగా దేశాన్ని పరిపాలించిన గొప్ప చక్రవర్తి గౌతమి పుత్రశాతకర్ణి. భరతజాతికి నూతన శకాన్ని ప్రసాదించాడు. రాజసూయ యాగం చేసిన మహా చక్రవర్తి. తెలంగాణలోని కోటిలింగాలలో పుట్టి మెదక్‌లోని కొండాపూర్ మొదలుకొని అమరావతి, ప్రతిష్టానపురం ఇలా దేశం నలుదిశలా తన సామ్రాజాన్యి విస్తరించిన పరాక్రమశీలి.


అలాంటి గొప్ప చక్రవర్తి కథతో క్రిష్ ఈ సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దారు. పంచభక్ష్యపరమాన్నాలతో కూడిన విందుభోజనంలా సినిమా ఉంటుంది. అభిమానులతో కలిసి మొదటి రోజు చూడాలనే ఆలోచనతో ఉన్నాను. అందుకే ఇప్పటివరకూ సినిమాను చూడలేదు. ఇలాంటి మంచి సినిమాల్ని ప్రోత్సహించాలనే ఆలోచనతో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు వినోదపు పన్ను మినహాయింపును ప్రకటించాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని తెలిపారు.


అదేసమయంలో తన కెరీర్‌లో ఎన్ని సినిమాలు చేశామనేది ముఖ్యంకాదు. సమాజానికి ఉపయోగపడే మంచి సినిమాలు చేయాలన్నదే నా అభిమతం. సాంఘికం, జానపదం, పౌరాణికం..ఇలా అభిమానుల అండ వల్లే అన్ని రకాల సినిమాలు చేయగలిగినట్టు బాలకృష్ణ చెప్పుకొచ్చారు.

English summary
NBK Fans dharna Bramarambha theatre today in Kukatpally for Gauthamiputra sathakarni benifit shows. Based on the story of an unsung hero called Gautamiputra Satakarni this film is produced by Rajeev Reddy and Krish himself. With Balakrishna being the best choice to play such historical characters the film is arriving at a time when Khaidi No 150 has already taken a superb start.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu