twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'సింహా' స్థాయికి మాత్రం తగ్గదు: బోయపాటి శ్రీను

    By Srikanya
    |

    హైదరాబాద్ : సింహా లాంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత మరోసారి బాలకృష్ణ,బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మరో చిత్రం రాబోతోంది. ఈ చిత్రం ఎలా ఉండబోతోందనే అంచనా అభిమానుల్లో ఉండటం సహజం. ఈ నేపధ్యంలో బోయపాటి శ్రీను క్లారిఫికేషన్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ... సింహా తరవాత నందమూరి బాలకృష్ణతో సినిమా చేయబోతున్నా. అంచనాలు ఏ విధంగా ఉంటాయో తెలుసు. 'సింహా'ని మించే సినిమా తీస్తా... అని చెబితే అది తొందరపాటు అవుతుంది. కానీ ఆ స్థాయికి మాత్రం తగ్గదు అన్నారు.

    అలాగే బాలకృష్ణ నుంచి ప్రేక్షకులు, అభిమానులూ ఏం కోరుకొంటారో అవన్నీ మేళవిస్తూ.. ఆయన్ని కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నా. రాజకీయ అంశాలూ ఉంటాయా? అని అందరూ అడుగుతున్నారు. అవీ ఉంటాయి. కానీ.. కథకు ఎంత వరకూ అవసరమో అంతే. ఆ గీత దాటి బయటకు వెళ్లవు అన్నారు. ఇక ఈ చిత్రం వచ్చే నెలలో ప్రారంభమవుతుందని చెప్పారు.

    ఇక ఆ చిత్రానికి 'రూలర్' టైటిల్ అని, మోహన్‌లాల్ కీలక పాత్ర చేస్తారని, నయనతార హీరోయిన్ అనీ.. ఇలా ఏవేవో ప్రచారమవుతున్నాయి. వీటిలో ఒక్కటి కూడా నిజం కాదు. అలాగే ఇందులో రాజకీయ అంశాలుంటాయని కూడా భావిస్తున్నారు. నేను కుటుంబ విలువలకు ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తిని కాబట్టి.. ఆ విలువలు కచ్చితంగా ఈ చిత్రంలో ఉంటాయి. భావోద్వేగాలు ఉంటాయి. 'సింహా'లో బాలయ్యలో కనిపించిన వాడి వేడి ఏ మాత్రం తగ్గవు. అందరూ అనుకుంటున్నట్లు రాజకీయాలకు సంబంధించిన అంశాలు ఉంటాయో లేదో చెప్పలేను. ఒకవేళ ఉంటే.. పైన చెప్పిన అంశాలకు ఇవి బోనస్ అవుతాయి. అంతేకానీ అవి లేకుండా పాలిటిక్స్‌కే పరిమితం అయ్యే సినిమా కాదు.

    బాలకృష్ణగార్ని దృష్టిలో పెట్టుకొని చేసిన కథ ఇది. ఏ సినిమాకైనా టిక్కెట్ తెగేది హీరోని చూసే. 50, 60 కోట్లు బడ్జెట్ పెడుతున్నారంటే అది హీరోని చూసే. అందుకే నా సినిమాల్లో హీరోని వేరే ఏ ఇతర పాత్రలూ డామినేట్ చేయనివ్వను. నా సినిమాల్లో నా హీరోనే హైలైట్‌గా నిలవాలని కోరుకుంటున్నాను. నేను ఏ హీరోతో సినిమా చేస్తే ఆ హీరోకి అభిమానిని అని భావిస్తా. అప్పుడే ఓ అభిమాని ఆ హీరో నుంచి ఏమేం ఎదురు చూస్తున్నాడో అవన్నీ చేయగలుగుతా.

    నా కళ్లారా చూసిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్. ఆయన పోయిన తర్వాత కూడా ఎవరూ ఆ స్థానాన్ని భర్తీ చేయలేకపోయారు. ఎందుకంటే రామారావుగారు తన ఒక్కడి గురించి మాత్రమే ఆలోచించలేదు. ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకువచ్చిన వ్యక్తి.నేను ఎన్టీఆర్‌ని 'రూలర్' అంటాను. లీడర్ అని కూడా అనను. లీడర్ టార్చ్‌లైట్‌లాంటివాడు. ఆఫ్ చేస్తే గుర్తుండడు. కానీ రూలర్ సన్‌లైట్‌లాంటివాడు. ఆపినా ఆగడు అని అన్నారు.

    English summary
    
 Boyapati Srinu Says... It will primarily be a film with very good human emotions. Balayya’s characterisation will be quite new, in a way that will thrill fans and cinema lovers. I have a great responsibility on my shoulders and I will do my best to come up with a very satisfying film. The movie will not be completely political. There will be one or two references here and there, but politics will not be the dominant emotion.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X