»   »  బాలయ్య-ప్రియమణి కాంబినేషన్ త్వరలో...

బాలయ్య-ప్రియమణి కాంబినేషన్ త్వరలో...

Posted By:
Subscribe to Filmibeat Telugu
Balakrishna
నందమూరి వంశం వారితో వరసగా సినిమాలు చేస్తున్న ఘనత ప్రియమణి పొందనుంది. రాజమౌళి శిష్యుడు మహదేవన్ దర్శకత్వంలో శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించనున్న ఈ సినిమా అక్టోబర్ తొమ్మిది(విజయదశమి) రోజున పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. శివలెంక కృష్ణ ప్రసాద్ గతంలో బాలయ్య తో ఆదిత్య 369,వంశానికొక్కడు,భలేవాడివి బాసు చిత్రాలు చేసారు. ఇక ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నారు.
ఈ సందర్బంగా నిర్మాత మాట్లాడుతూ "ఈ చిత్రానికి ప్రియమణిని హీరోయిన్ గా ఎంపిక చేసాం. డైలాగులు రత్నం అందిస్తున్నారు. రమా రాజమౌళి కాస్టూమ్స్ డిజైనర్,మణిశర్మ సంగీత దర్శకుడు.అక్టోబర్ నెలాఖరునుండి మొదటి షెడ్యూల్ ప్రారంభమవుతుంది. చంద్రమోహన్,బ్రహ్మానందం,ప్రదీప్ రావత్,తనికెళ్ళ భరిణి,ఆహుతి ప్రసాద్,ధర్మవరపు మిగతా ముఖ్య పాత్రల్లో చేయనున్నారు. ఆనందసాయి ఆర్ట్ ,రామ్-లక్ష్మణ్ స్టంట్స్ అందించనున్నారు".

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X