For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బాలకృష్ణ 'శ్రీమన్నారాయణ' పంచ్ డైలాగులు ఇవే

  By Srikanya
  |

  హైదరాబాద్: బాలకృష్ణ హీరోగా నటించిన 'శ్రీమన్నారాయణ' చిత్రం ఆడియో, ట్రైలర్స్ విడుదలైన సంగతి తెలిసిందే. చక్రి అందించిన ఆడియో మెల్లిమెల్లిగా హిట్ టాక్ తెచ్చుకుంటూంటే చిత్రంలోని డైలాగ్స్ మాత్రం బాలయ్య అభిమానుల్లో ఆనందాన్ని కలగచేస్తున్నాయి. ఈ చిత్రంలో బాలకృష్ణ తొలిసారిగా జర్నలిస్టు గా చేస్తున్నారు. ఆర్.ఆర్. మూవీమేకర్స్ సమర్పణలో ఎల్లో ఫ్లవర్స్ బేనర్‌పై రమేశ్ పుప్పాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవికుమార్ చావలి దర్శకుడు. చక్రి సంగీతం సమకూర్చగా చంద్రబోస్, కందికొండ, ప్రవీణ్ లక్మా పాటలు రాశారు.

  ఈ చిత్రంలో హైలెట్ గా వినపడుతున్న డైలాగులు..

  చెప్పడంలో కన్ఫూజన్ ఉండదు.. కొట్టడంలో కాంప్రమైజ్ ఉండదు

  నువ్వు ట్రాన్సఫార్మర్ ని టచ్ చేసావు.. కొడకా మసి అయ్యిపోతావు

  కడప సెవన్ రోడ్ సెంటర్ ఓకేనా... అనంతపూర్ సప్తగిరి సర్కిల్... కర్నాల్ కొండ రెడ్డి బురుజు, విజయవాడ బెంజ్ సర్కిల్, కరీంనగర్ కాశ్మీర్ కట్ట, లేదా ధూల్ పేట... తెగ షర్ కా అడ్డా...

  ఈ డైలాగులు అభిమానులులో ఉత్సాహాన్ని నింపి సినిమాపై నమ్మకాన్ని కలగచేస్తున్నాయి. బాలకృష్ణ సైతం ఈ చిత్రంపై మంచి నమ్మకంగా ఉన్నారు. ఆయన మాట్లాడుతూ..."మొదటిసారిగా 'శ్రీమన్నారాయణ'లో జర్నలిస్ట్‌గా చేశా. ఎంతో సాహసంతో కూడి, ఎన్నో నిజాలు, నగ్నసత్యాలను జనం ముందుకు తెచ్చే వృత్తి జర్నలిస్ట్ వృత్తి. అలాంటి బరువైన పాత్రను చేసినందుకు చాలా ఆనందంగానూ, గర్వంగాను ఉంది'' అని చెప్పారు నందమూరి బాలకృష్ణ.

  అలాగే "తెలుగుకు తెగులుపట్టిపోతున్న ఈ రోజుల్లో పవిత్రమైన, ఆహ్లాదకరమైన చక్కని తెలుగు టైటిల్‌తో వస్తున్న 'శ్రీమన్నారాయణ'లో టైటిల్ రోల్ చేయడాన్ని నా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రేక్షకులు కొత్తదనాన్ని ఆదరిస్తారని నా నట జీవితంలో చేసిన కొత్త తరహా పాత్రలు నిరూపించాయి. అలాగే ఈ జర్నలిస్ట్ పాత్రను ఆదరిస్తారని ఆశిస్తున్నా. దీన్ని దర్శకుడు రవికుమార్ చాలా బాగా మలిచారు. జర్నలిస్ట్ కేరక్టర్‌కి బాలకృష్ణనే పెట్టుకోవాల్సిన అవసరం ఆయనకు లేదు. సమాజంలో జరుగుతున్న అన్యాయాల్నీ, అక్రమాల్నీ దృష్టిలో పెట్టుకొని, ప్రజల్లో ఆలోచన రేకెత్తించాలనే ఉద్దేశంతో నేనైతే బాగుంటుందని ఈ సినిమా చేశారు. ఎన్నో సినిమాలు చేసిన నాకే ఈ సినిమా కొత్తగా అనిపించింది.

  ఇందులో బాలకృష్ణ రకరకాల అవతారాలు చూస్తారు. చక్రి ఆణిముత్యాల్లాంటి స్వరాలిస్తే, వాటికి మణిపూసల్లాంటి పాటలు రాశారు రచయితలు. గాయనీ గాయకులు అద్భుతంగా పాడారు. 'సింహా'ని దృష్టిలో ఉంచుకొని ఈ పాటలు చేశాడు చక్రి. ఇందులో హీరోయిన్లు నాట్యంలోనే కాకుండా తమ నటనా వైదుష్యాన్ని కూడా ప్రదర్శించారు. ఘటికాచలం అద్భుతమైన డైలాగ్స్ రాశారు. సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ నవరసాలున్న చిత్రం. అన్నీ అద్భుతంగా కుదిరిన సినిమా. నాదీ, అభిమానులదీ అవినాభావ సంబంధం. నేను ఏ పాత్ర చేసినా ఆదరిస్తూ వచ్చారు. అభిమానం అనేది డబ్బుకీ, ప్రలోభాలకీ లొంగేది కాదు. ఈ సినిమా నిర్మాత రమేశ్ పుప్పాల ఒక్కరే ఒక సంస్థ. కెప్టెన్ ఆఫ్ ది షిప్ నిర్మాత. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీ నిర్ణయిస్తాం'' అని చెప్పారు.

  English summary
  NBK- Srimannarayana-Punch dialogues-- 1.Cheppadam lo confusion vundadu.. kottadam lo compromise vundadu
 2.Nuvvu transformer ni touch chesav.... Kodaka Masayipothaav..
 3.Kadapa seven road centre okay na.. Ananthapur sapthagiri circle, Kurnool Konda Reddy buruju...Vijayawada Benz circle... Karimnagar Kashmir Katta... leda dhoolpet... teri sher ka adda...
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X