»   » 102వ సినిమా : కుంభకోణంలో బాలకృష్ణ

102వ సినిమా : కుంభకోణంలో బాలకృష్ణ

Posted By:
Subscribe to Filmibeat Telugu

నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న‌ 102వ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో నిర్మిస్తున విషయం తెలిసిందే. ప్ర‌స్తుతం కుంభ‌కోణంలో షూటింగ్ జ‌రుపుకొంటోంది. అక్క‌డ జ‌ర‌గుతున్న భారీ షెడ్యూల్‌లో షెడ్యూల్‌లో కీల‌క స‌న్నివేశాల‌తో పాటు, పోరాట ఘ‌ట్టాల్ని తెర‌కెక్కిస్తారు. ఈ షెడ్యూల్‌లో ప్ర‌ధాన తారాగ‌ణం అంతా పాలుపంచుకొంటుంది.

బాలయ్య సరసన నయనతార కథానాయికగా నటించనుండగా మ‌రో నాయిక‌గా న‌టాషా దోషీ ఎంపికైన సంగ‌తి తెలిసిందే. ప్రకాష్ రాజ్, మురళీమోహన్, బ్రహ్మానందం, జయ‌ప్ర‌కాష్ రెడ్డి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

NBK102 shooting in Kumbakonam

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. "సెన్సేషనల్ డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణగారు హీరోగా ఆయన 102వ చిత్రాన్ని నిర్మిస్తుండడం చాలా సంతోషంగా ఉంది. భారీ బడ్జెట్ తో అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో ఈ చిత్రాన్ని నిర్మించనున్నాం. ఎం.రత్నం అద్భుతమైన కథను అందించారు. "శ్రీరామరాజ్యం, సింహా" వంటి బ్లాక్ బస్టర్ల అనంతరం బాలకృష్ణ సరసన నయనతార నటించనుండడం విశేషం. రాంప్రసాద్ గారు ఈ చిత్రానికి కెమెరా బాధ్యతలు నిర్వర్తించనుండగా.. బాలయ్య 100వ చిత్రమైన "గౌతమిపుత్ర శాతకర్ణి" చిత్రానికి సంగీత సారధ్యం వహించి చారిత్రక విజయంలో కీలకపాత్ర పోషించిన చిరంతన్ భట్ ఈ చిత్రానికి కూడా సంగీతం సమకూర్చనుండడం విశేషం. రామోజీ ఫిలింసిటీలో భారీ సెట్ ను నిర్మించాం. ఆగస్ట్ 3 నుండి 30 రోజులపాటు ఇక్కడే చిత్రీకరణ జ‌రిగింది. ఇప్పుడు కొత్త షెడ్యూల్ కుంభ‌కోణంలో మొద‌లైంది. ఆదివారం నుంచి బాల‌కృష్ణ సెట్లో అడుగుపెట్టారు అన్నారు.

బాలకృష్ణ, నయనతార, న‌టాషా దోషీ, ప్రకాష్ రాజ్, మురళీమోహన్, బ్రహ్మానందం, జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి, ప్రభాకర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ-మాటలు: ఎం.రత్నం, కళ: నారాయణ రెడ్డి, పోరాటాలు: అరివుమణి-అంబుమణి, సినిమాటోగ్రఫీ: రాంప్రసాద్, సంగీతం: చిరంతన్ భట్, సహ-నిర్మాత: సి.వి.రావు, ఎద్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: వరుణ్-తేజ, నిర్మాణం: సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి, దర్శకత్వం: కె.ఎస్.రవికుమార్!

English summary
Nandamuri Balakrishna's 102 film shooting new schedulestarted in Kumbakonam. The movie directed by Ks Ravikumar, produced by C.Kalyan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu