twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గ్యాప్ తీసుకుని వస్తున్నాడు..హిట్ కొడతాడా?

    By Srikanya
    |

    హైదరాబాద్ : 'ఒరేయ్‌ పండు', 'మౌనమేలనోయి' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరో. హిందీలోనూ సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకొన్నారు. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ తెలుగులో 'నీజతగా నేనుండాలి' అనే చిత్రం చేశారు. హిందీలో విజయవంతమైన 'ఆషికి 2'కి రీమేక్‌గా రూపొందిన సినిమా ఇది. ఈ చిత్రాన్ని ఆగస్టు 15న విడుదల చేయాలని నిర్ణయించారు.

    సచిన్‌ మాట్లాడుతూ ''తొమ్మిదేళ్ల తర్వాత తెలుగులో సినిమా చేశాను. రాఘవ జయరాం అనే రాక్‌స్టార్‌ పాత్రలో కనిపిస్తాను. హిందీ పాటలు నచ్చి ఆ ట్యూన్స్‌ను అలాగే ఉంచాం. చంద్రబోస్‌ చక్కటి సాహిత్యం సమకూర్చారు. నా సినీ జీవితంలో పరాజయాలు ఎదురైనా బాధపడలేదు. మరింత కసితో ముందుకు సాగాను. త్వరలో తెలుగు, హిందీ భాషల్లో ఓ హారర్‌ సినిమా చేస్తున్నా. మరోవైపు థింక్‌ టాంక్‌ సంస్థని ఏర్పాటు చేస్తున్నాను. యువ ప్రతిభావంతులతో లఘుచిత్రాలు, సినిమాలు చేస్తుందీ సంస్థ''అని చెప్పారు.

    ''హిందీ సినిమాలు తెలుగులోకి అనువాదమైతే విజయం సాధించవనేది ఒట్టిమాట. నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేస్తే ప్రేక్షకాదరణ పొందొచ్చు.. చాలా సినిమాలు ఆ విషయాన్ని నిరూపించాయి'' అన్నారు సచిన్‌.

    'Nee Jathaga Nenundaali' Release Date Locked

    చిత్రం కథేమిటంటే...- రాహుల్ జయకర్ (ఆదిత్య రాయ్ కపూర్) పాప్ సింగర్. అతనికి అశేష అభిమానులు. అతడు ఆడింది ఆట పాడింది పాట. కానీ ఒక్కటే లోపం. తాగుడుకు బానిస. గోవా టూర్‌లో ఉండగా- అర్ధరాత్రి 'బార్'లన్నీ మూసేయటంతో.. ఊరి చివరి బార్ అండ్ రెస్టారెంట్‌కి వెళతాడు. అక్కడ తన పాటని అంతకంటె మృదు మధురంగా ఆలపించిన ఆరోహి షిక్రె (శ్రద్ధా కపూర్) టాలెంట్‌కి ముగ్ధుడవుతాడు. తనతోపాటు ముంబై వస్తే సింగర్‌ని చేస్తానంటాడు. అతని మాటలు నమ్మి ముంబై చేరుకుంటుంది ఆరోహి. అనుకోని పరిస్థితుల్లో రాహుల్ ఆస్పత్రి పాలవుతాడు. ఆరోహి చేసే ఫోన్లన్నీ రాహుల్ ఫ్రెండ్ రిసీవ్ చేసుకొని -రాహుల్ లండన్ వెళ్లాడని చెప్తాడు. దీంతో రాహుల్‌ని అపార్థం చేసుకుంటుంది ఆరోహి. రెండు నెలల తర్వాత రాహుల్ అసలు విషయం తెలుసుకొని ఆరోహి ఉన్న చోటికి వస్తాడు. అతడికి తెలిసిన మ్యూజిక్ కంపెనీలో ఆమెకి అవకాశం ఇప్పిస్తాడు. ఆమెలోని టాలెంట్ లోకానికి తెలుస్తుంది.

    ఇటు సినిమాల్లోనూ అటు ప్రైవేట్ ఆల్బమ్‌లతోనూ బిజీగా మారిపోతుంది. అనుక్షణం ఆమెని అంటిపెట్టుకొని ఉంటూ సలహాలు సూచనలూ చెబుతూ ఆమెలో ధైర్యాన్ని నింపే రాహుల్ రోజుల తరబడి తాగటంవల్ల అతడి గొంతు దెబ్బ తింటుంది. కనీసం లోబడ్జెట్ సినిమాలకైనా పాడదామనుకుంటే అక్కడా ఎదురుదెబ్బ తగులుతుంది. రాన్రాను రాహుల్ పతనమవటం చూసిన ఆరోహి అతణ్ణి మళ్లీ మామూలు మనిషిగా.. గాయకుడిగా తీర్చిదిద్దాలనుకుంటుంది. దాంతో అతడి ఫామ్‌హౌస్‌కి వెళ్లిపోతారిద్దరూ. కానీ - గతంలో చేసిన అగ్రిమెంట్స్ కారణంగా మళ్లీ కెరీర్‌ని ఆరంభించాల్సి వస్తుంది ఆరోహి. తన వల్లనే ఆమె కెరీర్ నాశనమై పోతోందనీ.. తను లేకుంటే ఆరోహి జీవితం బాగుంటుందని తలచి ఆత్మహత్య చేసుకొంటాడు రాహుల్. ఆ తర్వాత ఆరోహి జీవితం ఏమైందన్నది క్లైమాక్స్.

    ఆషికి-2కు మరో రికార్డు ఉంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల ఏ రేంజిలో పట్టం కట్టారంటే... క్రితం సంవత్సరం ఎక్కువ మంది వెతికిన భారతీయ సినిమాల లో ఈ సినిమా చోటు చేసుకుంది. 'ఆషికి-2' బాలీవుడ్ చిత్రాన్ని లక్షలాది మంది గూగుల్ సర్చ్‌లో గాలించారట. ఈ రొమాంటిక్ మ్యూజికల్ డ్రామాలోని 'అప్ నే కరమ్ కీ కర్ అదాయే' అనే మొదటి పాటను యూట్యూబ్‌లో ప్రతి రోజు అనేక మంది వీక్షించారు.

    English summary
    Sachiin Joshi's Upcoming Romantic and Music Entertainer Nee Jathaga Nenundaali which is an Official Remake for the Super Hit Bollywood film Aashiqui 2 was finally Releasing on August 15th as an Independence Day.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X