»   » రామ్ చరణ్ పాటే టైటిల్‌గా...ఫస్ట్ లుక్ డిట్టో (ఫోటో)

రామ్ చరణ్ పాటే టైటిల్‌గా...ఫస్ట్ లుక్ డిట్టో (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హిందీలో సూపర్ హిట్టయిన 'ఆషిఖి-2' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. సచిన్ జోషి హీరో. నాజియా హుస్సేన్ హీరోయిన్. ఈ చిత్రానికి 'నీ జతగా నేనుండాలి' అనే టైటిల్ ఖరారు చేశారు. రామ్ చరణ్ నటించిన 'ఎవడు' చిత్రంలోని 'నీ జతగా నేనుండాలి' అనే పాటనే ఈ టైటిల్ సెట్ చేసారు.

'బంపర్ ఆఫర్' ఫేం జయరవీంద్ర ఈ రీమేక్ కు దర్శకత్వం వహిస్తున్నాడు. హీరో సచిన్ జోషి, నిర్మాత బండ్ల గణేష్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. తాజాగా ఈచిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైంది. ఫస్ట్ లుక్ పోస్టర్ హిందీ వెర్షన్ పోస్టర్ కు డిట్టో ఉండటం గమనార్హం. దీన్ని బట్టి సినిమా కూడా సీన్ టు సీన్ డైలాగ్ టు డైలాగ్ అలానే తెరకెక్కిస్తారని తెలుస్తోంది. సెప్టెంబర్లో ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

Nee Jathaga Nenundali first look

హీరో విషయానికొస్తే....గతంలో తెలుగులో నిను చూడక నేనుండలేను, ఒరేయ్ పండు, మిత్రుడు చిత్రాల్లో నటించాడు. ఇక హీరోయిన్ నాజియా హుస్సేన్ బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ బంధువు. దర్శకుడు జయరవీంద్ర గతంలో బంపర్ ఆఫర్(సాయిరామ్ శంకర్)తో చేసి హిట్ కొట్టారు. అలాగే అదే సాయిరామ్ శంకర్ తో చేసిన దిల్లున్నోడు చిత్రం రీసెంట్ గా విడుదలై డిజాస్టర్ అయ్యింది.

ఈ చిత్రాన్ని హీరో సచిన్ జోషికి చెందిన వికింగ్‌ మీడియా, బండ్ల గణేష్‌ కు చెందిన పరమేశ్వర ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ తెలుగు రీమేక్ ని నిర్మిస్తున్నారు. అయితే హీరోనే మొత్తం డబ్బులు పెడుతున్నారని అంతటా వినిపిస్తోంది. బండ్ల గణేష్ కేవలం పేపరు పైన మాత్రమే నిర్మాత గా మాత్రమే...ఓ క్యాషియర్ గా వ్యవరిస్తున్నాడని అంటున్నారు.

English summary
Check out the Nee Jathaga Nenundali first look poster which is out just now by its producer Bandla Ganesh through his social networking account. Nee Jathaga Nenundali is official remake of Bollywood hit film Aashiqui 2. Sachiin J Joshi and Nazia Hussain (Sanjay Dutt’s niece) are playing lead roles in this movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu