»   » రైతుల కష్టాలపై ‘ఖైదీ నెం 150’ కొత్త సాంగ్, అద్భుతం....

రైతుల కష్టాలపై ‘ఖైదీ నెం 150’ కొత్త సాంగ్, అద్భుతం....

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఖైదీ నెం 150' సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన పాటలన్నీ అభిమానులను ఉత్సాహ పరిచేలా ఉన్నాయి. ఇప్పటి వరకు వచ్చిన పాటలకు భిన్నంగా తాజాగా రిలీజైన 'నీరు నీరు నీరు... రైతు కంట నీరు' అంటూ సాంగే సాంగ్ అభిమానులను కంటతడి పెట్టిస్తోంది. రైతుల కష్టాలను వర్ణిస్తూ సాంగే ఈ పాట ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది. ఆ పాటపై మీరూ లుక్కేయండి.

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌కత్వ ంలో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ నిర్మించిన‌ ఖైదీనంబ‌ర్ 150 చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 11న విడుద‌ల చేస్తున్నామ‌ని నిర్మాత రామ్‌చ‌ర‌ణ్ అధికారికంగా వెల్ల‌డించారు. అంత‌కంటే ముందే ఈనెల 7న విజ‌య‌వాడ‌- గుంటూరు మ‌ధ్య‌లో ఉన్న‌ హాయ్‌ల్యాండ్‌లో ప్రీరిలీజ్ వేడుక‌ను చేస్తున్నామ‌ని తెలిపారు.

Neeru Neeru Lyrical Video song

ఈ సందర్భంగా రామ్‌చ‌ర‌ణ్ మాట్లాడుతూ -ఖైదీనంబ‌ర్ 150 చిత్రాన్ని జ‌న‌వ‌రి 11న సంక్రాంతి కానుక‌గా ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నాం. ముందుగా ఈ సినిమాని జ‌న‌వ‌రి 12న రిలీజ్ చేయాల‌నుకున్నాం. అయితే ఇద్ద‌రు అగ్ర‌హీరోల సినిమాలు ఒకేరోజున రావ‌డం ఇండ‌స్ట్రీకి అంత మంచి ప‌రిణామం కాద‌ని నాన్న‌గారు చెప్ప‌డంతో ఒక‌రోజు ముందుగా అంటే జ‌న‌వ‌రి 11న విడుద‌ల చేస్తున్నాం. ఈ సినిమా డిస్ట్రిబ్యూట‌ర్స్ అంద‌రూ తేదీ మార్పు విష‌యాన్ని గ్ర‌హిస్తార‌ని ఆశిస్తున్నాను. అలాగే.. జ‌న‌వ‌రి 4న జ‌ర‌గాల్సిన ఖైదీనంబ‌ర్ 150 ప్రీరిలీజ్ ఫంక్ష‌న్ గ్రౌండ్ ప‌ర్మిష‌న్ ప్రాబ్లెమ్ కార‌ణంగా జ‌న‌వ‌రి 7న విజ‌య‌వాడ - గుంటూరు మ‌ధ్య‌లో ఉన్న హాయ్‌ల్యాండ్‌లో చేస్తున్నాం అని తెలిపారు.

ఖైదీనంబ‌ర్ 150 చిత్రంలో మెగాస్టార్‌ సరసన కాజల్ అగర్వాల్ క‌థానాయిక‌గా న‌టించ‌గా, తరుణ్‌ అరోరా విలన్‌గా న‌టించారు. దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన పాట‌లు శ్రోత‌ల మెప్పు పొందిన సంగ‌తి విదిత‌మే.

English summary
Neeru Neeru Lyrical Video song from the movie Khaidi No 150 is here... This song is a tribute to farmers from Khaidi No 150 Team.Khaidi No 150 Songs, Presenting to you Neeru Neeru Song Lyrical Video, Ft. Mega Star Chiranjeevi, Music by Rockstar Devi Sri Prasad and Directed by V V Vinayak.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X