For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  తైక్వాండో బ్లాక్‌ బెల్ట్‌ సాధించిన శేఖర్ కమ్ముల హీరోయిన్

  By Srikanya
  |

  ముంబై: శేఖర్ కమ్ముల 'గోదావరి' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ నీతూ చంద్ర. ఆ చిత్రంలో సుమంత్ కి మరదలు గా చేసిన నీతూ చంద్రను ఈ నెల 13న కొరియన్‌ ప్రభుత్వం ఘనంగా సత్కరించనుంది. ఢిల్లీలో జరిగే ఈ కార్యక్రమంలో తైక్వాండో 4వ డాన్‌ బ్లాక్‌ బెల్ట్‌ను నీతూ చంద్రకి ప్రధానం చేయనుంది. తైక్వాండో విభాగంలో ఈ బ్లాక్‌ బెల్ట్‌ పొందిన తొలి భారతీయ నటిగా ఆమె వార్తల్లోకి ఎక్కనుంది.

  ఈ సందర్భంగా నీతూ చంద్ర మాట్లాడుతూ తమ కుటుంబంలో డాక్టర్లు, ఇంజనీర్లు వున్నారని, తాను మాత్రం చదువుతో పాటు ఆటలపట్ల ఆసక్తి పెంపొందించుకున్నానని తెలిపారు. కుటుంబసభ్యుల మాదిరిగా తాను కూడా చదువుకే ప్రాధాన్యత ఇచ్చిఉంటే ఈ రోజున తనకు ఇంత గొప్ప గౌరవం లభించేదికాదని వ్యాఖ్యానించారు. పాఠశాల స్థాయిలో ఆటల్లో గెలుచుకున్న బహుమతులు ఇంకా తనకు గుర్తున్నాయన్నారు. ఆటల్లో పాల్గొనేలా తన తల్లి ఇచ్చిన ప్రోత్సాహం ఏనాటికీ మరువలేనిదన్నారు. ఫిట్‌నెస్‌గా ఉండేందుకు తాను ఇప్పటికీ కథక్‌ నృత్యం చేస్తానని ఆమె చెప్పారు. ఆటల్లో జిల్లా, రాష్ట్రస్థాయిల్లో పలు బహుమతులు సాధించిన తాను ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నట్లు నీతూ చంద్ర తెలిపారు.

  స్కిన్ షోతో, ఎక్స్ ఫోజింగ్‌తో ప్రేక్షకుల చూపులు తనవైపు తిప్పుకునే ఈ భామ ఆ తర్వాత రాజశేఖర్ నటించిన 'సత్యమేవ జయతే' చిత్రంలో, అనంతరం విశాల్ సరసన 'కిలాడీ' డబ్బింగ్ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చినా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేక పోయింది. తాజాగా ఆమెకు అటు బాలీవుడ్ లోనూ ఆఫర్లు పెద్దగా లేవు. అయితే ఉన్నట్టుండి ఓ హాలీవుడ్ సినిమాకు సైన్ చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది ఈ హాట్ బ్యూటీ. ఇంగ్లీష్, గ్రీక్ చిత్రంలో రూపొందుతున్న ఆ సినిమా పేరు 'హోం స్వీట్ హోం'.

  ప్రస్తుతం తమిళ స్టార్ హీరో కార్తీ సరసన 'బిర్యానీ'లో హీరోయిన్ గా నీతూ చంద్రని తీసుకున్నారు. వెంకట్‌ప్రభు దర్శకుడు. అజిత్‌తో 'గాంబ్లర్' లాంటి సంచలన విజయం తర్వాత వెంకట్‌ప్రభు దర్శకత్వం వహించబోయే సినిమా ఇదే కావడం విశేషం. ఈ చిత్రంలో ఆమె గ్లామర్ ని ఓ రేంజిలో పంచనుందని సమాచారం. ఇక నీతూచంద్ర తన తైక్వాండో విద్యను సినిమాల్లో ప్రదర్శించాలని ఉత్సాహపడుతోంది. అయితే మరి ఆమెకు ఎవరు ఈ ఆఫర్ ఇస్తారో చూడాలి అంటున్నారు.

  English summary
  
 Neetu Chandra hasn't been in the news recently for any films or roles. Suddenly she emerges on the scene as a Taekwondo expert. The actress showed off her skills during the training sessions in Mumbai.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X