»   » శేఖర్ కమ్ముల హీరోయిన్ కి హాలీవుడ్ ఆఫర్

శేఖర్ కమ్ముల హీరోయిన్ కి హాలీవుడ్ ఆఫర్

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదారాబాద్ : శేఖర్ కమ్ముల చిత్రం 'గోదావరి' లో హీరో మరదలు రాజీ పాత్రలో నటించిన నీతు చంద్ర గుర్తుండే ఉంటుంది. ఆ తరవాత రాజశేఖర్‌తో 'సత్యమేవ జయతే'లో నటించింది. ఈ భామకి ఇక్కడ సక్సెస్ దక్కలేదు. తమిళంలోనూ కొన్ని చిత్రాలు చేసింది. హిందీలో 'గరమ్‌ మసాలా', '13బి' లాంటి చిత్రాలు చేసి ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకొంది. నీతు త్వరలో హాలీవుడ్‌ చిత్రంలో నటించబోతోంది.

సూపర్ హిట్స్ 'జుమాంజీ', 'జురాసిక్‌ పార్క్‌ 3', 'హనీ, ఐ ష్రంక్‌ ద కిడ్స్‌' లాంటి చిత్రాలను రూపొందించిన దర్శకుడు జో జాన్‌స్టన్‌. ఆయన త్వరలో ఓ చిత్రం తెరకెక్కించబోతున్నారు. ఇందులో ఓ పాత్ర నీతు చంద్రకి దక్కింది. ఆ కథలో భారతీయురాలి పాత్ర ఉంది.

ఈ చిత్రంలో నటించేందుకు నీతుకి ఆడిషన్‌ కూడా నిర్వహించారు. వచ్చే నెలలో లాస్‌ఏంజిల్స్‌లో షూటింగ్ ఉంటుంది. అక్కడికి వెళ్లేందుకు ఆమె ఏర్పాట్లు చేసుకొంటోంది. ఇటీవలే నీతు ఓ గ్రీకు భాషా చిత్రంలో నటించింది.

మరో ప్రక్క 'జయం'రవి, నీతూచంద్ర జంటగా అమీర్‌సుల్తాన్ దర్శకత్వంలో డిఎంకె నాయకుడు అన్బుళగన్ నిర్మించిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఆదిభగవాన్'. తమిళంలో విడుదలై విజయం సాధించిన ఈ చిత్రాన్ని అన్బుళగన్ స్వయంగా తెలుగులోకి అనువదిస్తున్నారు. డబ్బింగ్ కార్యక్రమాలు శరవేగంతో జరుగుతున్నాయి. త్వరలో సినిమాను విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.

English summary
Neetu Chandra seems to be on a roll. If all goes well, the Aadhi Bhagavan actress will likely be a part of Hollywood film. The buzz is that the actress will be part of a film directed by Joe Johnston of Jumaji and Captain America: The First Avenger fame. Interestingly, Neetu is likely to sign another project and is expected to leave to Los Angeles soon. Neetu Chandra had earlier got an opportunity to work in a Greek film titled Home Sweet Home. It looks like the girl is going places.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu