»   » నియంత హిట్లర్ ప్రియురాలిగా బాలీవుడ్ బ్యూటీ

నియంత హిట్లర్ ప్రియురాలిగా బాలీవుడ్ బ్యూటీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాజీ నియంత హిట్లర్‌ చరిత్ర ఆధారంగా తీస్తున్న సినిమాలో అతడి ప్రియురాలు ఇవా బ్రాన్‌గా బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ నేహా ధూపియా అవకాశం సంపాదించింది. రాకేశ్‌ రంజన్‌ కుమార్‌ అనే నూతన దర్శకుడు రూపొందిస్తున్న ఈ చిత్రం టైటిల్ 'డియర్‌ ఫ్రెండ్‌ హిట్లర్‌'. అనుపమ్‌ ఖేర్‌ హిట్లర్‌ పాత్రలో కనిపిస్తారు. వచ్చే నెల నుంచి షూటింగ్‌ మొదలయ్యే ఈ సినిమా..హిట్లర్‌ చివరి రోజుల్లో బెర్లిన్‌ బంకర్‌లో ఎలా గడిపాడో చూపిస్తుంది. సోవియట్‌ సేనలు జర్మనీ రాజధానిపై బాంబుల వర్షం కురిపించడంతో 1945, ఏప్రిల్‌ 30న హిట్లర్‌ మరణించాడు. ప్రాణాలు కోల్పోవడానికి కేవలం 40 గంటల ముందు ఏర్పాటైన చిన్న కార్యక్రమంలో బ్రాన్ ‌ను పెళ్లాడాడు. ఆఖరి పది రోజులు హిట్లర్‌ ఎలా గడిపాడో ఇందులో చూపిస్తారు. గతంలో నేహా 'ఢిల్లీ హైట్స్‌', 'సింగ్‌ ఈజ్‌ కింగ్‌', 'మిథ్యా' వంటి సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రంలో నటించటం కోసం నేహా...డీవీడీలు చూస్తూ పుస్తకాలు చదువుతూ హిట్లర్‌, బ్రాన్‌కు సంబంధించిన సమాచారాన్ని సేకరించే పనిలో మునిగిపోయింది. డియర్‌ ఫ్రెండ్‌ హిట్లర్‌కు అంతర్జాతీయ గుర్తింపు రావడం ఖాయమని జోస్యం చెప్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu