»   » రామ్ చరణ్ హీరోయిన్ తో సాయిరామ్ శంకర్

రామ్ చరణ్ హీరోయిన్ తో సాయిరామ్ శంకర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రామ్ చరణ్ తొలి చిత్రం చిరుత లో చేసిన నేహాశర్మ గుర్తుండే ఉంటుంది. ఆమె తాజాగా సాయిరామ్ శంకర్ సరసన ఎంపికైందని సమాచారం. జయాపజయాలకు సంభంధం లేకుండా వరసగా సినిమాలు చేసుకుంటూ పోతున్న సాయిరామ్‌శంకర్ హీరోగా మరో కొత్త చిత్రం ప్రారంభం కానుంది. జయ ఆర్ట్స్ పతాకంపై జె.కె.సాగర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. దర్శకత్వశాఖలో అనుభవం కలిగిన ధర్మరక్ష ఈ చిత్రంతో దర్శకునిగా పరిచయమవుతున్నారు.

చిత్రం గురించి నిర్మాత సాగర్ వివరిస్తూ 'యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్ అంశాలు కలిగిన చిత్రమిది. హీరో సాయిరామ్‌శంకర్‌కి మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది. డిసెంబర్ నుంచి షూటింగ్ ప్రారంభిస్తాం' అన్నారు. ఈ సినిమాకి సంగీతం: అనూప్ రూబెన్స్, ఫైట్స్: కణల్‌కన్నన్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ధర్మరక్ష. పూరి జగన్నాథ్ తమ్ముడిగా తెరంగేట్రం చేసిన సాయిరామ్ శంకర్ కి చెప్పుకోదగ్గ హిట్స్ తక్కువగా ఉన్నప్పటికీ ప్రస్తుతం వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ఒక దాని తర్వాత ఒకటి ఇలా వరుస సినిమాలు ఒప్పుకుంటూ అందరికీ షాక్ ఇస్తున్నాడు.

తేజతో చేసిన'వేయి అబద్ధాలు'డిజాస్టర్ అయినప్పటికీ తన డైరీ ఖాలీ లేకుండా చూసుకుంటున్నాడు. ప్రస్తుతం 'రోమియో' చిత్రం చేస్తున్న సాయిరామ్ శంకర్ మరో రెండు చిత్రాలను ఒప్పుకున్నారని సమాచారం. అందులో ఒకటి పైన చెప్పుకున్న చిత్రం. ఇది కాకుండా 'A వచ్చి B ఫై వాలె' అనే సినిమా కూడా ఆ మధ్యన ప్రారంభమై ఆగింది. ఆ చిత్రం కూడా తిరిగి ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ చిత్రం ద్వారా సుందర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తేజ సాయిరామ్ శంకర్ తో హిట్ కొట్టి ఇద్దరూ హిట్ పెయిర్ అనిపించుకుంటారేమో చూడాలి.

English summary
Sairam Shankar will soon be seen in a film to be directed by Dharma Raksha. The year is turning out to be quite a busy one for Sairam Shankar who’s awaiting the release of Mr Romeo. It remains to be seen if lady luck will finally smile on Sairam Shankar or not since he desperately needs a hit to cement his place in the industry.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu