»   » మెగా హీరోయిన్ చెల్లితో రామ్ రొమాన్స్

మెగా హీరోయిన్ చెల్లితో రామ్ రొమాన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : హెడ్డింగ్ కాస్త కన్ఫూజింగ్ గా ఉంది కదూ... అయితే ఇది చదవాల్సిందే. రామ్ చరణ్ హీరోగా పరిచయం అయిన ‘చిరుత' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ నేహ శర్మ. ఆ తర్వాత తెలుగులో వరుణ్ సందేశ్ హీరోగా నటించిన ‘కుర్రాడు' సినిమాలో కనిపించింది. కానీ తెలుగులో ఆ తర్వాత అవకాసాలు పట్టలేకపోయింది. అప్పడప్పుడూ హిందీలో సినిమాలు చేస్తున్న ఈమె తన సిస్టర్ ఆయేశా శర్మని తెలుగులో లాంచ్ చేస్తోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

తాజా సమాచారం ప్రకరం ఆయేషా శర్మ రామ్ హీరోగా నటిస్తున్న ‘శివం' సినిమాలో హీరోయిన్ గా కనిపించనుంది. ఆయేషా చేస్తున్న మొదటి సినిమా ఇదే.ఆయేషా శర్మ గత కొంతకాలంగా యాక్టింగ్, కథక్ మరియు వాయిస్ మాడ్యులేషన్స్ పై కోచింగ్ తీసుకుంటోంది.

Neha Sharma’s sister pairs up with Ram

ఆయేషా శర్మ తన తెలుగు తొలి పరిచయ సినిమా గురించి మాట్లాడుతూ ‘నేను హీరోయిన్ అవ్వాలని కలలు కన్న నా డ్రీం నిజం అయినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. తెలుగులో శివం సైన్ చేసాను, హిందీలో కూడా పలు ఆఫర్లు వస్తున్నాయి, కానీ ఇంకా ఫైనలైజ్ చెయ్యలేదుఇక స్టార్ అండ్ సూపర్బ్ యాక్టర్ తనతో నటించే చాన్స్ రావడం చాలా హ్యాపీగా ఉందని' తెలిపింది. శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. స్రవంతి రవి కిషోర్ ఈ సినిమాకి నిర్మాత.

అలాగే ‘సెకండ్‌ హ్యాండ్‌' మూవీతో దర్శకుడైన కిషోర్‌ తిరుమలతో సినిమా చేసేందుకు రామ్‌ సిద్దమయ్యాడట. ఈ చిత్రానికి ‘హరికథ' అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. స్క్రిప్ట్‌ వర్క్‌లో ఉన్న కిషోర్‌ తిరుమల రామ్‌ నటిస్తున్న ‘పండగ చేస్కో' చిత్రం తర్వాత 'హరికథ' మొదలు పెడతారని ఫిలింనగర్‌ టాక్‌.

Neha Sharma’s sister pairs up with Ram

రామ్ తాజా చిత్రం ‘పండగ చేస్కో' విషయానికి వస్తే...

రామ్‌ హీరోగా నటిస్తున్న సినిమా ‘పండగ చేస్కో'. రకుల్‌ ప్రీత్‌సింగ్‌ హీరోయిన్. గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. పరుచూరి కిరీటి నిర్మిస్తున్నారు. యునైటెడ్‌ మూవీస్‌ పతాకంపై పరుచూరి ప్రసాద్‌ సమర్పిస్తున్నారు. పక్కా మాస్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. ఈ సినిమాలోని ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.

దర్శకుడు మాట్లాడుతూ ‘‘ రామ్‌ బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టు హీరో పాత్ర చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుంది. పూర్తిస్థాయి మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. తమన్‌ మంచి సంగీతాన్నిచ్చారు. యువతతో పాటు అందరికీ నచ్చే సినిమా అవుతుంది'' అని చెప్పారు.

Neha Sharma’s sister pairs up with Ram

రకుల్‌ ప్రీత్‌సింగ్‌, సోనాల్‌ చౌహాన్‌, సాయికుమార్‌, సంపత్‌, రావు రమేష్‌, బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, రఘుబాబు, సుప్రీత్‌, బ్రహ్మాజీ, సుబ్బరాజు, అభిమన్యుసింగ్‌, వెన్నెలకిశోర్‌, ప్రభాస్‌ శ్రీను, ఫిష్‌ వెంకట్‌, తేజస్విని తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కథ; వెలిగొండ శ్రీనివాస్‌, మాటలు: కోన వెంకట్‌, రచన సహకారం: అనిల్‌ రావిపూడి, కెమెరా: ఆర్థర్‌ విల్సన్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఆర్ట్‌: ఎ.ఎస్‌.ప్రకాష్‌, ఫైట్స్‌: రామ్‌-లక్ష్మణ్‌, సంగీతం: థమన్‌.ఎస్‌.ఎస్‌., పాటలు: భాస్కరభట్ల, శ్రీమణి, డ్యాన్స్‌: రాజు సుందరం.

English summary
Ram Charan’s debut flick heroine Neha Sharma’s sister Aisha Sharma is now making her debut in the tinsel town. Apparently Aisha Sharma is making her debut alongside hero Ram.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu