హ్యాపీ‌గా వెడ్డింగ్‌‌కు సిద్ధమవుతున్న నిహారిక.. వాలంటైన్ డే రోజు..

By Rajababu

మెగా డాటర్ నిహారిక నటించిన హ్యాపీ వెడ్డింగ్‌ షూటింగ్ పూర్తి చేసుకొన్నది. క్వీన్ ఆఫ్ టాలీవుడ్ అనుష్క‌తో భాగ‌మ‌తి లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్‌ను రూపొందించిన యూవీ క్రియేష‌న్స్, పాకెట్ సినిమా సంయుక్తంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ల‌క్ష్మ‌ణ్ కార్య ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ హీరో సుమంత్ అశ్విన్, మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల జంట‌గా నటించారు. ఈ చిత్ర షూటింగ్ విషయాలు మీకోసం..

హ్య‌పీ వెడ్డింగ్ షూటింగ్ పూర్తి

హ్య‌పీ వెడ్డింగ్ షూటింగ్ పూర్తి

'హ్య‌పీ వెడ్డింగ్ షూటింగ్ ఇటీవలే పూర్తిచేసుకుంది. యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ లో తొలిసారిగా సుమంత్ అశ్విన్ న‌టిస్తున్నారు. ఈ క‌థ చెప్ప‌గానే చాలా ఎక్సైట్ అయ్యానని హీరోయిన్ నిహ‌రిక చెప్పిన సంగతి తెలిసిందే. మొట్ట‌మొద‌టి సారి సుమంత్ అశ్విన్ తో చేయ‌టం విశేషం. వీరిద్ద‌రి మ‌ద్య జ‌రిగే చ‌క్క‌టి క‌థ గా ఈ చిత్రం తెర‌కెక్కుతుంది.

శరవేగంగా పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ పనులు

శరవేగంగా పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ పనులు

ప్ర‌స్తుతం పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రానికి ఫిదా చిత్రానికి సంగీతం అందించిన శక్తికాంత్ కార్తీక్ మ్యూజిక్‌ను అందిస్తున్నారు. ఫిబ్ర‌వ‌రి 14 వేలంటైన్స్ డే సంద‌ర్బంగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుద‌ల చేయ‌టానికి నిర్మాత‌లు స‌న్నాహ‌లు చేస్తున్నారు. వచ్చే వేసవిలో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

యూవీ క్రియోష‌న్స్ బ్యాన‌ర్‌లో

యూవీ క్రియోష‌న్స్ బ్యాన‌ర్‌లో

ఈ సంద‌ర్భంగా నిర్మాత‌లు మాట్లాడుతూ.. తెలుగు సినిమా పరిశ్ర‌మ‌లో వ‌రుస విజ‌యాలు సాధిస్తున్న‌ క్రేజి బ్యాన‌ర్ యూవీ క్రియోష‌న్స్ బ్యాన‌ర్ లో 2018 లొ భాగ‌మ‌తి తో సూప‌ర్ బ్లాక్‌బ‌స్ట‌ర్ ని సాధించినందుకు యూవీ క్రియెష‌న్స్ వారికి మా శుభాకాంక్ష‌లు. అలాంటి ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ‌ తో మేము అసోసియోట్ గా హ్య‌పివెడ్డింగ్‌ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాము. సుమంత్ అశ్విన్‌, నిహారిక లు జంట‌గా న‌టిస్తున్నారు అని తెలిపారు.

శక్తికాంత్ కార్తీక్ మ్యూజిక్

శక్తికాంత్ కార్తీక్ మ్యూజిక్

ఫిదా లాంటి మ్యూజిక్ ఛార్ట్‌బ‌స్ట‌ర్ ని అందించిన శక్తికాంత్ కార్తిక్ మా చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. రోమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ గా తెర‌కెక్కిన‌ ఈ చిత్రం ప్ర‌స్తుతం షూటింగ్ పూర్తిచేసుకుని పొస్ట్‌ప్రోడ‌క్ష‌న్ లో బిజిగా వుంది. ద‌ర్శ‌కుడు ల‌క్ష్మ‌ణ్ కార్య ద‌ర్శ‌కుడు అని పేర్కొన్నారు.

ఫ్యామిలీ సెంటిమెంట్‌తో

ఫ్యామిలీ సెంటిమెంట్‌తో

పెళ్ళి కుదిరిన రోజు నుండి పెళ్ళి జ‌రిగేరోజు వ‌ర‌కూ మ‌ద్య‌లో రెండు కుటుంబాల మ‌ధ్య, రెండు మ‌న‌సుల మ‌ధ్య ఏం జ‌రుగుతుంద‌నే విష‌యాన్ని చాలా అందంగా మా ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించాడు. ప్ర‌తి ఓక్క‌రి జీవితం లో ఇలాంటి అనుభ‌వం జ‌రిగివుంటుంది. ప్ర‌తిప్రేక్ష‌కుడ్ని ఈ పాత్ర‌లో త‌మ‌నితాము చూసుకునేలా పాత్ర‌ల్లో ప్రేక్ష‌కులు లీన‌మ‌య్యేలా ప్ర‌తి పాత్ర తీర్చిదిద్దాము అని నిర్మాతలు అన్నారు..

ఫిబ్రవరి 14న ఫస్ట్‌లుక్

ఫిబ్రవరి 14న ఫస్ట్‌లుక్

ఈ స‌మ్మ‌ర్ కి పెర్‌ఫెక్ట్ ఫ్యామిలి అండ్ రోమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ గా ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తుంది. ఫిబ్ర‌వ‌రి 14న ఈ చిత్రం ఫస్ట్‌లుక్ ని విడుద‌ల చేయాలనే ప్రయత్నంలో ఉన్నాం. ఈ చిత్రంలో సుమంత్ అశ్విన్‌, నిహ‌రిక‌తోపాటు న‌రేష్, ముర‌ళి శ‌ర్మ‌, ప‌విత్ర లోకేష్, తుల‌సి, ఇంద్ర‌జ‌, మ‌ధుమ‌ణి త‌దిత‌రులు నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X