Don't Miss!
- News
పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కన్నుమూత
- Finance
Infosys: ఫ్రెషర్లకు ఇన్ఫోసిస్ ఝలక్..! ఉద్యోగాల తొలగింపు.. ఆ టెక్నిక్ వాడుతూ..
- Travel
వైజాగ్ సమీపంలోని సందర్శనీయ పర్యాటక ప్రదేశాలు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Sports
INDvsAUS : స్పిన్నర్ల ఎంపికపై ఆసీస్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
- Lifestyle
Valentines Day 2023: వాలెంటైన్స్ డే రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు, ఉన్న మూడ్ పోయి సమస్యలు రావొచ్చు
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
ట్విట్టర్ రివ్యూ: నేల టిక్కెట్టు.. మాస్ మహారాజ ప్రభావం, కళ్యాణ్ కృష్ణ ఈ సారి!
Recommended Video

మాస్ మహారాజ రవితేజ నటించిన నేల టికెట్ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రెండు వరుస విజయాలతో మంచి గుర్తింపు పొందిన కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. సోగ్గాడే చిన్నినాయనా, రారండోయ్ వేడుక చూద్దాం వంటి చిత్రాలు ఈ దర్శకుడి నుంచి రావడంతో నేల టికెట్ చిత్రంపై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. మాస్ మహారాజా రవితేజ అప్పియరెన్స్, డెబ్యూ బ్యూటీ మాళవిక శర్మ అందాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. యుఎస్, తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈ చిత్ర షోలు ప్రారంభమయ్యాయి. ట్విట్టర్లో వస్తున్న టాక్ ఎలా ఉందొ ఇపుడు చూద్దాం..
|
ఫస్ట్ హాఫ్ ఎలా ఉందంటే
సాధారణంగా రవితేజ సినిమా అంటే ప్రేక్షుకులు మాస్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఆశిస్తారు. నేల టికెట్ చిత్రంలో ఆ అంశాలు ఉన్నట్లు ట్రైలర్ ద్వారా అర్థమైంది. ఫస్ట్ హాఫ్ బావున్నట్లు కొందరు ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు.
|
డివైడ్ టాక్
నేల టికెట్ చిత్రానికి డివైడ్ టాక్ కూడా వస్తోంది. సినిమా ఆశించిన స్థాయిలో లేదు. బిలో యావరేజ్ చిత్రం.
|
కనీసం కామెడీ కూడా
చిత్రంలో కనీసం కామెడీ కూడా లేదు. సినిమా రొటీన్ గా ఉంది. బోరింగ్ సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి. రవితేజకు ఇది మరో డిజాస్టర్.
|
రవితేజ కొత్తదారి ఆలోచించాలి
రవితేజ తన సినిమాల విషయంలో కొత్తగా ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఇలాంటి రొటీన్ కథలని విడిచిపెట్టాలి.
|
అభిమానులకు నిరాశ
రవితేజ నుంచి మంచి మాస్ చిత్రాన్ని ఆశించిన ప్రేక్షకులకు నేల టికెట్ చిత్ర నిరాశ కలిగించే విధంగా ఉంది. రవితేజ నుంచి వచ్చిన మరో బ్యాడ్ మూవీ ఇది.
|
పవన్ అభిమానుల నుంచి
నేల టికెట్ చిత్ర యూనిట్ కు పవన్ కళ్యాణ్ ఫాన్స్ నుంచి శుభాకాంక్షలు అందుతున్నాయి. నేల టికెట్ చిత్రం హిట్ కావాలని కోరుకుంటున్నారు.
|
కనీసం తరువాత చిత్రం అయినా
రవితేజ హిట్ కోసం నెక్స్ట్ మూవీ వరకు ఆగాల్సిందే. నేల టికెట్ చిత్రం డిజాస్టర్ టాక్ తో మొదలైంది.
|
ఆల్ ది బెస్ట్ అంటూ ఆ డైరెక్టర్
రవితేజకు రాజా ది గ్రేట్ వంటి మంచి హిట్ అందించిన దర్శకుడు అని రావిపూడి చిత్ర యూనిట్ కు తన విషెష్ తెలియజేసారు.
|
ప్రీమియర్స్ నుంచి కూడా
యుఎస్ ప్రీమియర్స్ నుంచి కూడా నేల టికెట్ చిత్రానికి డివైడ్ టాక్ వస్తోంది.
|
అలాంటి కథలతో
రవితేజ ఇకపై యుఎస్ ఆడియన్స్ ని మెప్పించేలా కథలు ఎంపిక చేసుకోవాలి. ఇలాంటి కథలు యుఎస్ బాక్స్ ఆఫీస్ వద్ద ఏమాత్రం ప్రభావం చూపవు.