»   » మహేష్ తర్వాత రెండో స్థానంలో రానా.... బాలీవుడ్లో దిమ్మదిరిగే రేటు!

మహేష్ తర్వాత రెండో స్థానంలో రానా.... బాలీవుడ్లో దిమ్మదిరిగే రేటు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'బాహుబలి' సినిమా ఎఫెక్టుతో టాలీవుడ్ యంగ్ హంక్ రానా దగ్గుబాటి కెరీర్లో చాలా మార్పు వచ్చింది. సినిమా అవకాశాలు బాగా పెరడం మాత్రమే కాదు, ఆయన నటించిన సినిమాలకు డిమాండ్ కూడా అదే స్థాయిలో పెరిగింది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రానా నటించిన 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రానికి బాలీవుడ్లో దిమ్మదిరిగే రేటు పలికింది. ఈ చిత్రం హిందీ డబ్బింగ్ రైట్స్ రూ. 11 కోట్లకు అమ్ముడు పోయాయి.


మహేష్ బాబు తర్వాత రానా

మహేష్ బాబు తర్వాత రానా

మహేష్ బాబు నటించిన ‘స్పైడర్' మూవీ హిందీ డబ్బింగ్ రైట్స్ రూ. 28 కోట్లకు అమ్ముడు పోగా... ఆ సినిమా తర్వాత ఈ ఏడాది అత్యధికంగా ధర పలికిన చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి'. అల్లు అర్జున్ నటించిన ‘డిజె-దువ్వాడ జగన్నాథమ్' చిత్రానికి హిందీ డబ్బింగ్ రైట్స్ రూపంలో కేవలం రూ. 7 కోట్లు మాత్రమే వచ్చాయి.


పొలిటికల్ ఎంటర్టెనర్

పొలిటికల్ ఎంటర్టెనర్

తేజ దర్శకత్వంలో పొలిటికల్ ఎంటర్టెనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. రానాలో పెర్ఫార్మెన్స్ పరంగా, బాడీ లాంగ్వేజ్ పరంగా కూడా చాలా మార్పు వచ్చింది.


పవర్ ఫుల్ క్యారెక్టర్

పవర్ ఫుల్ క్యారెక్టర్

‘నేనే రాజు నేనే మంత్రి' చిత్రంలో రానా జోగేంద్ర అనే పవర్ ఫుల్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. అన్యాయాలను ఎదురించి ఓ సామాన్యుడు సీఎం ఎలా అయ్యాడు అనేది కథాంశం. ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటించగా, అనూప్ సంగీతం అందిస్తున్నాడు.


డైలాగ్స్ అదరుర్స్

డైలాగ్స్ అదరుర్స్

ట్రైలర్ లోని సన్నివేశాలు, రానా చెప్పిన డైలాగ్స్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తున్నాయి. ఇక చివరిలో పాముకి పుట్ట కావాలంటే చీమలే కదరా కష్టపడాలి అని రానా చెప్పిన డైలాగ్ అదరహో అని అంటున్నారు అభిమానులు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుండగా, వీలైనంత త్వరగా మూవీ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.English summary
The Hindi dubbing rights for Teja's political thriller Nene Raju Nene Mantri starring Rana Daggubati, have been sold for a whopping Rs 11 crore.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu