For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  జోగేంద్ర యువ గర్జన: ఎన్టీఆర్, ఎంజీఆర్ నా దేవుళ్లు.... రానా స్పీచ్ అదుర్స్!

  By Bojja Kumar
  |

  డా.డి.రామానాయుడు సమర్పణలో సురేశ్ ప్రొడక్షన్స్, బ్లూ ప్లానెట్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'నేనే రాజు నేనే మంత్రి'. వివేక్‌ కూచిభొట్ల, అభిరామ్‌ దగ్గుబాటి ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతలు. కాజల్‌ అగర్వాల్‌, కేథరిన్‌ నాయికలు.

  నేనే రాజు నేనే మంత్రి: జోగేంద్ర యువగర్జన (ఫోటోస్)

  తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల కాబోతోంది. సినిమా ప్రమోషన్లో భాగంగా ఈ చిత్రానికి సంబంధించి 'జోగేంద్ర యువగర్జన' కార్యక్రమం హైదరాబాద్ లో బుధవారం సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా రానా స్పీచ్ ఆకట్టుకుంది.

  జోగేంద్ర పాత్రలో ఎన్టీఆర్‌, ఎంజీఆర్‌గారి ఫిలాసఫీ

  జోగేంద్ర పాత్రలో ఎన్టీఆర్‌, ఎంజీఆర్‌గారి ఫిలాసఫీ

  రానా మాట్లాడుతూ ‘‘సినిమాల పరంగా, వ్యక్తిగతంగా, జీవితపరంగా నందమూరి తారకరామారావుగారంటే నాకు దేవుడులాంటివారు. ఎన్టీఆర్‌గారి, ఎంజీఆర్‌గారి ఫిలాసఫీలు జోగేంద్ర అనే పాత్రలో ఉంటాయి. అందుకే ఈ సినిమా చేశాను అన్నారు.

  Recommended Video

  Rana's Nene Raju Nene Mantri becomes world’s first movie With 3D Augmented Reality
  తాత చూడలేక పోయాడనే బాధ ఉంది

  తాత చూడలేక పోయాడనే బాధ ఉంది

  ఈ సినిమా నాకు చాలా ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయిన సినిమా. ఈ సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సినిమా గురించి నేను చాలా గర్వంగా ఉన్నా. ఈ సినిమాను మా తాత చూడలేకపోయారనే లోటు ఉంది. ఈ రోజు ఈ వేదిక మీద నిలబడ్డామంటే ఆయన వల్లే. ఆయనతో సినిమా చేయలేదనే బాధ ఉండేది. నాకు తెలిసి ఆయన వెళ్లిపోయాక చాలా పాజిటివ్స్‌ జరుగుతున్నాయి. పైనుంచి ఆయనే సెట్‌ చేస్తున్నారని అనిపిస్తోంది. మా నాన్నతో ఫస్ట్‌ టైమ్‌ కలిసి చేశాం. మా నాన్న రియలీ గుడ్‌ ప్రొడ్యూసర్‌ అని రానా చెప్పుకొచ్చారు.

  ఏవిఎం స్టూడియోలో తేజ ఫ్లోర్లు తుడిచేవాడు

  ఏవిఎం స్టూడియోలో తేజ ఫ్లోర్లు తుడిచేవాడు

  ఈ సినిమా ముందు తేజగారితో పరిచయం చాలా తక్కవు. తొలినాళ్లలో ఆయన ఏవిఎం స్టూడియో ఫ్లోర్స్ లో పని చేసే వారు. ఆ ఫ్లోర్లు తుడిచేవారు. అక్కడే కెమెరా అసిస్టెంటుగా చేరారు. పని నేర్చుకున్నారు. పాండీ బజార్ షాపుల ముందు పడుకున్నారు. అలా వచ్చిన ఆయన బాంబే వెళ్లి, అతిపెద్ద కెమెరామెన్ అయి, అమీర్ ఖాన్, మహేష్ భట్ సినిమాలకు చేసి తర్వాత తెలుగులోకి వచ్చి, దర్శకుడు అయ్యారు. ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను. సినిమా మీద తేజగారికున్న అవగాహన చాలా ఎక్కువ. ఇది జోగేంద్ర జీవిత చరిత్ర. అది రాయాలంటే జీవితంపై అవగాహన ఉండాలి. అందుకే తేజగారు ఈ స్టోరీ అంత బాగా రాశారు అని రానా చెప్పుకొచ్చారు.

  వెంకీ అభిమానుల సపోర్టు ఉంటే హాలీవుడ్లో కూడా

  వెంకీ అభిమానుల సపోర్టు ఉంటే హాలీవుడ్లో కూడా

  వెంకటేశ్‌గారి అభిమానులు నాకు తోడు ఉన్నారన్న ధైర్యంతోనే నేను అన్నీ చేస్తున్నా. ఇదే సపోర్ట్‌ ఇస్తే హాలీవుడ్‌ సినిమా కూడా ఇక్కడి నుండే చేస్తాను... అని రానా వ్యాఖ్యానించారు.

  అందుకే పాతవాళ్లతో

  అందుకే పాతవాళ్లతో

  తేజ మాట్లాడుతూ ‘‘రానా గారికి కథ చెప్పగానే ఆయనకి నచ్చిందని చేశాం. రానా అంత పొడవుగా ఉన్న అమ్మాయి కావాలని కాజల్‌గారి దగ్గరకు వెళ్లాం. స్టైలిష్‌ కేరక్టర్‌ కోసం కేథరిన్‌ని తీసుకున్నాం. కొత్తోళ్లతో సినిమా చేసి బోర్‌ కొట్టిందని పాత వాళ్లతో తీశా`` అని చెప్పారు.

  జోగేంద్ర గుర్తిండి పోతాడు

  జోగేంద్ర గుర్తిండి పోతాడు

  కాజల్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా నాకు స్పెషల్‌ సినిమా. రానాతో నాకు ఎంత పరిచయం ఉన్నా నాకు జోగేందర్‌గానే గుర్తుండిపోతాడు. సినిమాని ఎలా చూడాలో, ఎలా ప్రేమించాలో తేజగారి దగ్గర నేర్చుకున్నా. తేజగారికి ఎప్పటికీ రుణపడి ఉంటా. ఆయన నాకు గురువులాంటివారు'' అని చెప్పారు.

  నా కొడుకుతో సినిమా అంటే భయం

  నా కొడుకుతో సినిమా అంటే భయం

  డి.సురేశ్‌ బాబు మాట్లాడుతూ.... బాహుబలి అయిన తర్వాత ఈ కథని ఓకే చేశాం. కథలంటే నాకు మామూలుగా భయం, అదీ నా కొడుకుతో సినిమా అంటే చాలా భయం. రానా ఈ క‌థ విని సెట్‌ అవుతుందనుకున్నాడు. ఆ తర్వాత ఆ కథని చాలా బాగా తయారుచేశారు అని తెలిపారు.

  English summary
  Rana Speech at Jogendra Yuvagarjana Event on Suresh Productions. Nene Raju Nene Mantri 2017 Telugu Movie ft. Rana Daggubati, Kajal Aggarwal, Catherine Tresa and Navdeep in lead roles. NeneRajuNeneMantri movie is directed by Teja and produced by Suresh Daggubati, CH Bharath Chowdhary and V Kiran Reddy under Suresh Productions and Blue Planet Entertainments. Music for #NRNM is composed by Anup Rubens.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X