twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘నేనే రాజు నేనే మంత్రి’ : అవేమీ పట్టించుకోనంటున్న రానా

    రానా నటించిన ‘నేనే రాజు నేనే మంత్రి’ విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాతో పాటు మరో రెండు చిత్రాలు రిలీజవుతున్నాయి.

    By Bojja Kumar
    |

    రెగ్యులర్‌ సినిమాలకు భిన్నంగా డిఫరెంట్‌ సబ్జెక్ట్స్ ఎంచుకుంటూ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నా రానా 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రంతో రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సినిమా ప్రమోషన్లో భాగంగా రానా మీడియాతో ముచ్చటించారు.

    రానా మాట్లాడుతూ 'నేనే రాజు నేనే మంత్రి' ఔట్‌ అండ్‌ ఔట్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌. తేజగారు కథ చెప్పగానే ఇమ్మీడియెట్‌గా నేను, మా నాన్న ఓకే చేశాం. పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే రాధా జోగేంద్ర లవ్‌స్టోరి ఇది. మాస్‌ డైలాగ్స్‌, యాక్షన్‌, ఎమోషన్‌ సీన్స్‌ అన్నీ ఈ చిత్రంలో వుంటాయని రానా తెలిపారు.

    తొలిసారి ఓ కొత్త జోనర్ చేస్తున్నాను

    తొలిసారి ఓ కొత్త జోనర్ చేస్తున్నాను

    నా కెరీర్లో నేను చేస్తున్న ఒక డిఫరెంట్ జోనర్ మూవీ ఇది. ఇందులో నేను చేసే రెండు భిన్నమైన షేడ్స్‌ వున్న జోగేంద్ర క్యారెక్టర్‌లో నటించాను. ఈ చిత్రం అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది అని రానా తెలిపారు.

    మా ఫాదర్‌ గ్రేట్‌ సపోర్ట్‌ ఇచ్చారు

    మా ఫాదర్‌ గ్రేట్‌ సపోర్ట్‌ ఇచ్చారు

    తొలిసారిగా మా సొంత బేనర్లో సినిమా చేయడం హ్యాపీగా వుంది. ఫస్ట్‌ నుండి మా బేనర్‌లో చేద్దాం అనుకున్నాం. కానీ కుదరలేదు. ఈ సినమా కథ మా నాన్నకి, బాబాయ్ వెంకటేష్‌కి, నాకు బాగా నచ్చింది. మా ఫాదర్‌ గ్రేట్‌ సపోర్ట్‌ ఇచ్చారు. కిరణ్‌రెడ్డి, భరత్‌చౌదరి ప్రొడక్షన్‌లో ఇన్‌వాల్వ్‌ అయి అన్ని పనులు చక్కగా చేశారు అని రానా తెలిపారు.

    పూర్తి స్థాయి పొలిటికల్ డ్రామా కాదు

    పూర్తి స్థాయి పొలిటికల్ డ్రామా కాదు

    'లీడర్‌' అనేది ఫుల్‌ప్లెడ్జ్‌డ్‌ పొలిటికల్‌ సినిమా. కానీ ఈ సినిమాలో పాలిటిక్స్‌ అనేది చిన్న అంశం మాత్రమే. మెయిన్‌గా ఒక భర్త, భార్య మధ్య జరిగే కథ. అనంతపూర్‌, కారైకుడి ప్రాంతాల్లో వడ్డీ వ్యాపారం చేసే వ్యక్తి జోగేంద్ర, అలాంటి సింపుల్‌ లైఫ్‌ గడిపే ఆ వ్యక్తికి కొన్ని పరిస్థితులు ఎదురవుతాయి. అవేంటి అనే సబ్జెక్టుతో సినిమా ఆసక్తిగా ఉంటుందని తెలిపారు.

    తమిళ వెర్షన్ మార్చాం

    తమిళ వెర్షన్ మార్చాం

    ఈ సినిమా చూశాక అక్కడ రాజకీయాలకు బాగా కనెక్ట్‌ అవుతుంది అన్పించింది. నేను ప్రతిసారి పొలిటికల్‌ సినిమా చేసేటప్పుడు ఎక్కడో ఒకచోట కనెక్ట్‌ అవుతూనే వుంది. తమిళ రాజకీయాలను పోలి ఉంటుంది కాబట్టి తమిళ్‌లో చాలా మార్పులు చేసి చేశామని రానా తెలిపారు.

    తేజ లాంటి ప్లాప్ డైరెక్టర్ తో చేయడానికి కారణం అదే

    తేజ లాంటి ప్లాప్ డైరెక్టర్ తో చేయడానికి కారణం అదే


    ఒక దర్శకుడికి గతంలో ప్లాపులు ఉన్నాయా, హిట్స్ ఉన్నాయా? అని నేను పట్టతించుకోను. బాహుబలి తీసిన రాజమౌళి అయినా, ‘ఘాజీ' తీసిన కొత్త డైరెక్టర్‌ సంకల్ప్‌రెడ్డి అయినా, ఇంకెవరైనా నాకు నచ్చే విధంగా కథ ఉంటే చేస్తాను. జోగేంద్ర కథ నచ్చింది కాబట్టే సినిమా చేశాను అని రానా తెలిపారు.

    కాంపిటీషన్ పట్టించుకోను

    కాంపిటీషన్ పట్టించుకోను

    నా సినిమా రిలీజయ్యేప్పుడు ఇతర సినిమాలు వస్తే కాపిటీషన్ ఫీలవ్వను. ఇలాంటివి అసలు పట్టించుకోను. ప్రతి సినిమా డిఫరెంట్‌ జోనర్‌లో వస్తుంది. నా చిన్నప్పుడు ఒకే వారం నాలుగైదు సినిమాలు వచ్చేవి. అప్పుడే సినిమా మూడ్‌ అనేది వస్తుంది అని రానా తెలిపారు.

    హాలీవుడ్‌ ప్రాజెక్టుల గురించి

    హాలీవుడ్‌ ప్రాజెక్టుల గురించి

    హాలీవుడ్ ప్రాజెక్టులు కొన్ని డిస్కషన్స్‌ జరుగుతున్నాయి. ఇంకా ఫైనల్‌ కాలేదు. బిగ్‌ ప్రొడక్షన్‌ బేనర్‌లో ఒక సినిమా చేయబోతున్నాను. త్వరలో వెల్లడిస్తాను అని రానా తెలిపారు.

    English summary
    "Nene Raju Nene Mantri" Rana interview. Nene Raju Nene Mantri is on upcoming 2017 Telugu political thriller film written and directed by Teja, featuring Rana Daggubati, Kajal Aggarwal and Catherine Tresa in the lead roles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X