తాప్సీ కెరీర్లోనే ది బెస్ట్... ‘నేనే షబానా’ (తెలుగు ట్రైలర్)
హైదరాబాద్: శివమ్ నైర్ దర్శకత్వం లో తాప్సి , అక్షయ్ కుమార్ , ప్రిథ్వీరాజ్ సుకుమారన్, మనోజ్ బాజ్పాయ్ , అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రలో హిందీ లో తెరకెక్కుతున్న మూవీ 'నామ్ షబానా'. ఈ చిత్రాన్ని తెలుగులో 'నేనే షబానా' పేరుతో రిలీజ్ చేయబోతున్నారు.
తాజాగా తెలుగు ట్రైలర్ విడుదల చేసారు. ట్రైలర్ చూస్తుంటే తాప్సీ కెరీర్లోనే ది బెస్ట్ సినిమా అవుతుందని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఈ చిత్రంలో తాప్సీ ఓ నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీలో ఏజెంటుగా కనిపించబోతోంది.
దేశ రక్షణ కోసం తాప్సీ చేసిన సాహసాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే నీరజ్ పాండే కథ అందిస్తున్నారు. ఫ్రైడే ఫిలింవర్క్స్ బ్యానర్ ఫై నీరజ్ పాండే , షీతల్ భాటియా నిర్మిస్తున్నారు.
హిందీతో పాటు తెలుగులో ఒకేసారి మార్చి 31న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కాగా తాప్సీ నటించిన 'ఘాజీ' మూవీ ఈ నెల 17 న విడుదలై మంచి విజయం సాధించింది. రానా ప్రధాన పాత్రలో సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో తాప్సీ మెంగాలీ రెఫుగీ అనన్య పాత్రలో నటించింది.


Click it and Unblock the Notifications











