»   » వావ్... ఎంత రొమాంటిక్‌గా ఉందో (నాని ‘నేను లోకల్’ టీజర్)

వావ్... ఎంత రొమాంటిక్‌గా ఉందో (నాని ‘నేను లోకల్’ టీజర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం, భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ‌, జెంటిల్ మ‌న్‌, మ‌జ్ను..వ‌రుస ఐదు చిత్రాల స‌క్సెస్‌తో ప్రేక్ష‌కుల్లో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్న నాని త్వరలో 'నేను లోకల్' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ చిత్రంలో కీర్తిసురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా అఫీషియల్ టీజర్ రిలీజ్ చేసారు. రొమాంటిక్ గా డిజైన్ చేసిన ఈ టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో తెరకెక్కుతున్న ఈచిత్రానికి త్రినాథ రావు నక్కిన ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. శిరీష్ నిర్మాత‌. ఈ సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది.

చిత్ర స‌మ‌ర్ప‌కుడు దిల్ రాజు మాట్లాడుతూ....ఎప్ప‌టి నుండో నానితో ఓ సినిమా చేయాల‌నుకుంటున్నాను. నేను లోక‌ల్‌ సినిమాతో కుదిరింది. త్రినాథ‌రావు న‌క్కిన చెప్పిన క‌థ చాలా బాగా న‌చ్చింది. త్రినాథ్ స్టైల్ ఆప్ ఎంట‌ర్‌టైన్మెంట్‌తో ఎన‌ర్జీ ఉన్న క్యారెక్ట‌ర్ బేస్డ్ ల‌వ్‌స్టోరీగా నేను లోక‌ల్ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోందన్నారు.

rn

టీజర్

దేవిశ్రీ అందించిన మ్యూజిక్ హైలైట్‌గా నిలుస్తుంది. హీరోగా సినిమాలు చేస్తోన్న నవీన్ చంద్ర ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ చేయటానికి ఒప్పుకున్నందుకు చాలా థాంక్స్. దీపావ‌ళి సంద‌ర్భంగా ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేస్తున్నాం. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను క్రిస్మ‌స్ సంద‌ర్భంగా విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. ఇప్ప‌టికే ఐదు వ‌రుస స‌క్సెస్‌లు కొట్టిన నాని మా బ్యాన‌ర్‌లో విడుద‌ల‌వుతున్న నేను లోక‌ల్‌తో సెకండ్ హ్యాట్రిక్ పూర్తిచేస్తాడ‌నే న‌మ్మ‌కంగా ఉన్నాం. నాని కెరీర్‌లో ఈ చిత్రంలో ఓ డిఫరెంట్ మూవీగా నిలుస్తుంది అన్నారు దిల్ రాజు.

నేను లోకల్

నేను లోకల్

నాని, కీర్తిసురేష్ హీరో హీరోయిన్స్‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ : దిల్ రాజు, సినిమాటోగ్రఫి నిజార్ షఫీ, సంగీతం : దేవి శ్రీ ప్రసాద్, కథ - స్క్రీన్‌ప్లే, మాటలు : ప్రసన్న కుమార్ బెజవాడ, రచన : సాయి కృష్ణ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - త్రినాథ రావు నక్కిన, అసోసియేట్ ప్రొడ్యూసర్ : బెక్కెం వేణుగోపాల్, సహ నిర్మాత : హర్షిత్ రెడ్డి, నిర్మాత : శిరీష్.

గాంధీ కొబ్బరియ, మోడీ గుమ్మడి కాయ అంటూ... నోట్ల ఇష్యూ నాని ట్వీట్!

గాంధీ కొబ్బరియ, మోడీ గుమ్మడి కాయ అంటూ... నోట్ల ఇష్యూ నాని ట్వీట్!

దేశ వ్యాప్తంగా రూ. 1000, రూ. 500 నోట్ల ఇష్యూపై హాట్ టాపిక్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై సెలబ్రిటీలంతా తమదైన రీతిలో స్పందించారు. అయితే తెలుగు హీరో నాని చేసిన ట్వీట్ మాత్రం కాస్త ఆశ్చర్యంగా ఉంది.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

రవితేజ, నాగార్జునా కాదన్న కథనే నానితో... దిల్ రాజు పట్టుదల అదీ

రవితేజ, నాగార్జునా కాదన్న కథనే నానితో... దిల్ రాజు పట్టుదల అదీ

వేణు శ్రీరాం గుర్తున్నాడా... ఓ మై ఫ్రెండ్ అంటూ వచ్చిన ఈ దర్శకుడు ఆ ఫ్లాప్ దెబ్బకి కుదేలైపోయాడనుకున్నారంతా కానీ తన ప్రయత్నాలని తాను సైలెంట్ గా చేస్తూ....(పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి)

అభిమానులని నమ్ముకొని సినిమాలు తీయను... నాని ఇంత మాటనేసాడేమిటీ.!?

అభిమానులని నమ్ముకొని సినిమాలు తీయను... నాని ఇంత మాటనేసాడేమిటీ.!?

సాధారణం గానే హీరో అంటే అభిమానులకీ అభిమ్నానులంటే హీరోలకీ ఒక బాండ్ ఉంటుంది. అభిమాన హీరో సినిమా అనగానే అదొక పండగల ఫీలయ్యే అభిమానులుంటారు. తమ హీరొ సినిమా...పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ఎంత ముద్దుగా రాసిందో....హీరో నానికి చిన్నారి లేఖ!

ఎంత ముద్దుగా రాసిందో....హీరో నానికి చిన్నారి లేఖ!

ఓ చిన్నారి తనకు లేఖ రాసిన లేఖను నాని ట్విట్టర్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు. 'ఓ చిన్న పాప సొంతంగా తయారుచేసిన ఈ లేఖను షూటింగ్‌ ... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

"నోరు అదుపులో పెట్టుకోండి".... నాని నే టార్గెట్ గా "డెక్కన్ క్రానికల్" కథనం

టాలీవుడ్ నటులకూ హీరోలకూ ఆదవాళ్లంటే చిన్న చూపు. ఎందుకో గానీ ఈమధ్య ఇదే ఉద్దెశ్యం పెరిగిపోతోంది. నటీమణుల మీదా, యాంకర్ల మీదా వెకిలి మాతలు తరచుగా.... (పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి)

English summary
Watch Nenu Local Official Teaser, starring Nani, Keerthy Suresh and others. Screenplay-Direction Trinadha Rao Nakkina. Music composed by Devi Sri Prasad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu