»   » దిల్ రాజు భలే స్కెచ్ వేశాడు.. రాజ్ తరుణ్‌కు చెక్ నానికి ఛాన్స్

దిల్ రాజు భలే స్కెచ్ వేశాడు.. రాజ్ తరుణ్‌కు చెక్ నానికి ఛాన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్‌లో వ‌రుస హిట్ల‌తో జోరు చూపిస్తున్నాడు నేచుర‌ల్ స్టార్ నాని. భ‌లే భ‌లే మ‌గాడివోయ్ సినిమా త‌ర్వాత నాని సినిమాల‌కు అదిరిపోయే రేంజ్లో ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. ఇప్ప‌టికే ఐదు వ‌రుస హిట్ల‌తో ఉన్న నాని త‌న తాజా చిత్రం నేను లోక‌ల్ సినిమాతో మ‌రో హిట్ కొట్టి డ‌బుల్ హ్యాట్రిక్ హిట్ల‌ను త‌న ఖాతాలో వేసుకుంటాడ‌న్న అంచ‌నాలు ఉన్నాయి.

శుక్రవారం విడుదలైన నేచురల్‌ స్టార్‌ నాని 'నేను లోకల్‌' సినిమా మంచి ఓపెనింగ్స్‌ రాబట్టింది. యూఎస్‌ ప్రీమియర్‌ షోల ద్వారా కూడా ఈ సినిమా భారీగానే ఆర్జించింది. 'శతమానం భవతి' ఘనవిజయంతో మంచి జోష్‌లో ఉన్న దిల్‌ రాజుకు మరో విజయం లభించినట్టే. అయితే ఈ సినిమా దర్శకుడు నక్కిన త్రినాధ్‌ ఈ కథను రాసింది నానిని దృష్టిలో ఉంచుకుని కాదట. కథ రాసేటప్పుడు అసలు సీన్లో నాని లేనేలేడు.

Nenu local story was for Raj tarun but Dil Raju suggested Nani

ఈ సినిమాను రాజ్‌తరుణ్‌ హీరోగా చేద్దామనుకున్నాడట. నిర్మాత బెక్కం వేణుగోపాల్‌ కూడా రాజ్‌తరుణ్‌ కే ఓటేయటం తో సినిమాకి హీరోగా రాజ్ ఓకె అనుకున్నాక అసలు మార్పు వచ్చిపడింది.. అయితే ఫైనాన్స్‌ కోసం దిల్‌ రాజు వద్దకు వెళ్లి కథ వినిపించాడట. కథ విన్న దిల్‌ రాజు ఈ కథ నానికి అయితే బాగుంటుందని,

రాజ్ తరుణ్ కన్నా నాని అయితేనే కథకి సూటబుల్ గా ఉండటం తో పాటు ఇప్పటికే మంచి రైజింగ్ లో ఉన్న నాని వల్ల బిజినెస్ కూడా బావుంటుందని చెప్పి, అందుకు అంగీకరిస్తేనే తాను ఆ టీమ్ లో చేరతానని చెప్పాడట. దీంతో ఈ సినిమా రాజ్ తరుణ్ నుంచి నాని చేతులోకి వెళ్లింది. అయితే సినిమా విడుదలయ్యాక వచ్చిన రెస్పాన్స్ చూస్తె.. నానితో చేస్తేనే బాగుంటుందనే దిల్‌ రాజు అంచనా నిజమైందని ఇప్పుడు అంటున్నారు. ఒకవేళ రాజ్‌తరుణ్‌తోనే ఈ సినిమా చేసినట్టైతే సినిమా ఓకే అనిపించుకున్నా ఇప్పుడున్నంత హైప్ మాత్రం వచ్చేది కాదని అనుకుంటున్నారు...

English summary
Latest Buzz from Tollywood Nenu local movie Director nakkina trinatha rao writen the story for Raj tarun
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu