twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టెపరరీ ప్రాబ్లమ్ కి సూసైడ్ పర్మనెంట్ సొల్యూషన్..!

    By Sindhu
    |

    పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రాణా, ఇలియానా జంటగా నటించిన 'నేను-నా రాక్షసి' చిత్రం ఆడియో వేడుకను ఆదివారం హైదరాబాదు, హైటెక్ సిటిలో జరిగింది. దర్శకుడు వి.వి.వినాయక్ సీడీలను విడుదల చేసి, తొలి సీడీని హీరో వెంకటేష్ కు అందించారు. ఈ సందర్భంగా పూరీ జగన్నాథ్ చెబుతూ, 'ఓ ప్రొఫిషనల్ హంతకునికీ, రాక్షసి లాంటి అమ్మాయికీ మధ్య జరిగిన అందమైన కథ ఇది" అన్నారు. రాణా ఇప్పటివరకు చేసిన రోల్స్ కంటే ఇందులో డిఫరెంట్ గా చేశాడని పూరి జగన్నాథ్ చెప్పారు. టెపరరీ ప్రాబ్లమ్ కి సూసైడ్ పర్మనెంట్ సొల్యూషన్ అనే కీ రోల్ బ్యాక్ డ్రాప్ కథతో చాలా థ్రిల్లింగ్ వచ్చిందని తెలియజేశారు.

    హీరో రాణా మాట్లాడుతూ, 'ఓ రోజు మిట్టమధ్యాహ్నం ఎండలో నిలబెట్టి జగన్ నాకీ కథ చెప్పారు. ఇంటికెళ్లి ఆ కథనంతా కాగితం మీద రాసుకున్నాను. అంతలా నచ్చింది నాకు"అన్నాడు. 'నేనింతవరకూ చేసిన సినిమాలలో నాకు నచ్చిన పాత్ర ఈ సినిమాలోనే చేశాను" అంది ఇలియానా. వెంకటేష్ మాట్లాడుతూ,'ఈ సినిమా పబ్లిసిటీ ట్రైలర్స్ చూస్తుంటే సినిమాలో ఏదో విషయం ఉందనిపిస్తోంది" అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో రవితేజ, గోపీచంద్, రామ్, రిచా తదితరులు పాల్గొన్నారు.

    English summary
    Ace director Puri Jagannath-directed film Nenu Naa Rakshasi, starring Rana Daggubati and Ileana, had its audio launch on Sunday at the HICC, Hitech City, Hyderabad. The film is produced by Nallamalupu Srinivas. Interestingly, the event looked more like a reality show.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X