»   » 'నేను శైలజ' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

'నేను శైలజ' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :న్యూ ఇయర్ సందర్బంగా విడుదలైన చిత్రాల్లో 'నేను శైలజ' ఒకటి. మార్నింగ్ షో నుంచి సినిమా హిట్ టాక్ తో రన్ అవుతున్న సంగతి తెలిసిందే. ట్రేడ్ లో అందుతున్న లెక్కల ప్రకారం ఈ సినిమా మాగ్జిమం కలెక్షన్స్ రాబడుతోంది. ఈ సినిమాకు సంబందించిన మొదటి వారాంతం షేర్ లెక్కలు ఇక్కడ చూడండి.

నైజాం : 3.04 కోట్లు
సీడెడ్ : 1.28 కోట్లు
ఉత్తరాంధ్రా : 66 లక్షలు
ఈస్ట్ : 42.30 లక్షలు
వెస్ట్ : 38 లక్షలు
క్రిష్ణ : 62.09 లక్షలు
గుంటుర్ : 64 లక్షలు
నెల్లుర్ : 28 లక్షలు
ఓవరాల్ ఎపి, నైజాం : 7.32 కోట్లు
చిత్రం కథేమిటంటే...

హరి(రామ్) కి చిన్నప్పటినుంచీ కనపడ్డ అమ్మాయికల్లా ప్రపోజ్ చేయటం..నో చెప్పించుకోవటం అలవాటే. ఇలా రొటీన్ గా నో చెప్పించుకుంటున్న హరికి అదే ఊళ్లో ఉంటున్న శైలజ పరిచయం అవుతుంది. ఆమెను చిన్నప్పుడే ఇంప్రెస్ చేసిన హరి...తర్వాత అతని కుటుంబం వేరే ఊరికి షిప్ట్ అవటంతో దూరం అవుతాడు. ఈ మనసంతా నువ్వే లవ్ స్టోరీ ...వీళ్లిద్దరూ పెద్దవాళ్లయ్యాక మళ్లీ మొదలవుతుంది.

పెరిగి పెద్దైన శైలజ (కీర్తి సురేష్) అతనికి అనుకోకుండా కనిపిస్తుంది. ఆమెను పరిచయం చేసుకుని, ఇంప్రెస్ చేసి, ట్రై చేసి ప్రపోజ్ చేస్తాడు. అయితే శైలజ...ఐ లవ్ యు..బట్ ఐ యామ్ నాట్ లవ్ విత్ లవ్ యు అని కన్ఫూజ్ డైలాగు చెప్పి..దూరం అయిపోతుంది. ఆమె అలా ఎందుకు హరికి కన్ఫూజ్ డైలాగు చెప్పింది. ఆమెకు ఏదన్నా సమస్య ఉందా...ఉంటే హరి దాన్ని ఎలా తీర్చాడు...ఆమె ప్రేమను ఎలా పొందాడు అనే విషయాలుతెలియాలంటే...ఈ హరి కథ మీరు తెరపై చూడాల్సిందే.

Nenu sailaja first First Weekend Collections

నిర్మాత రవికిషోర్ మాట్లాడుతూ.... ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇది. చిత్ర కథ వైజాగ్‌లో మొదలై అక్కడే ముగుస్తుంది. ప్రేమకథకు కుటుంబ భావోద్వేగాల్ని జోడించి ఈ చిత్రాన్ని నిర్మించాం. కిషోర్ కథ చెప్పగానే రామ్‌కు కొత్త తరహా సినిమా అవుతుందన్న నమ్మకంతో ఈ చిత్రం చేయడానికి ముందుకొచ్చాం. దాదాపు ఏడాది పాటు స్క్రిప్ట్ వర్క్ చేశాం. ఒక అమ్మాయి, అబ్బాయి మధ్య సాగే ప్రేమకథ కాబట్టి నేను...శైలజ టైటిల్ అయితే బాగుంటుందని ఈ పేరును ఖరారు చేశాం..మంచి హిట్ టాక్ వస్తోంది అన్నారు.

రామ్ మాట్లాడుతూ.... ఈ ఏడాది మూడు చిత్రాల్లో నటించాను. తొలుత ఈ చిత్రానికి హరికథ అనే వర్కింగ్ టైటిల్ అనుకున్నాం. కానీ సినిమా చూసిన తరువాత దీనికి నేను...శైలజ కరెక్ట్ అని భావించాం. 55 రోజుల్లో చిత్రాన్ని పూర్తి చేశాం. నైట్ క్లబ్‌లో పనిచేసే డీజేగా నటించాను. సాఫ్ట్‌గా కనిపించే పాత్ర అయినా మాస్‌కు బాగా కనెక్ట్ అవుతుంది. ప్రేక్షకులు ఊహించని స్థాయిలో సినిమా వుంటుంది అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ నా జీవితంలో జరిగిన ఓ సంఘటనను తీసుకుని కథగా మలిచాను. సినిమాలోని ప్రతి సన్నివేశం చాలా రియలిస్టిక్‌గా వుంటుంది అన్నారు.

సత్యరాజ్, నరేష్, ప్రిన్స్, విజయ్‌కుమార్, రోహిణి, ప్రగతి, కృష్ణచైతన్య, ప్రదీప్‌రావత్, ధన్య బాలకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల, అనంతశ్రీరామ్, సాగర్, డ్యాన్స్: శంకర్, దినేష్, ప్రేమ్క్ష్రిత్, రఘు, ఫైట్స్: పీటర్ హేయిన్స్, హరి, దినేష్, ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, ఎడిటింగ్: శ్రీకర్‌ప్రసాద్, కెమెరా: సమీర్‌రెడ్డి, సంగీతం: దేవిశ్రీప్రసాద్, రచన, దర్శకత్వం: కిషోర్ తిరుమల.

English summary
Ram's ‘Nenu Sailaja’ had amassed a good share in the first weekend of its release in both the Telugu States.
Please Wait while comments are loading...