»   » ‘నేను శైలజ’లో డిలీట్ చేసిన సీన్లు... (వీడియోలు)

‘నేను శైలజ’లో డిలీట్ చేసిన సీన్లు... (వీడియోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై రామ్ హీరోగా స్రవంతి రవికిషోర్ నిర్మించిన చిత్రం నేను శైలజ. ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జనవరి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చి మార్నింగ్ షో నుంచే మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ మధ్య వరుస ప్లాపులతో సతమతం అయిన రామ్ ... ఈ చిత్రం మంచి ఫలితాలు ఇవ్వడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నాడు.

కాగా.... ఈ సినిమా ఎడిటింగ్ విషయంలో దర్శకుడు కిషోర్ తిరుమల, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. సినిమాలో అనవసర సీన్లకు చాలా వరకు కత్తెర వేసారు. సినిమా విడుదలైన మంచి విజయం సాధించిన నేపథ్యంలో అప్పుడు డిలీట్ చేసిన ఆసీన్లను ఇపుడు యూట్యూబ్ ద్వారా విడుదల చేసారు.


ఎడిటింగ్ సమయంలో డిలీట్ చేసిన 5 సీన్లను విడుదల చేసారు. ఈ ఐదు సీన్లలో ఒక్క సీన్ కూడా ఆసక్తికరంగా లేదు. అపుడు వాటిని తొలగించబట్టే సినిమా బ్రతికి పోయిందని, లేకుంటే ప్రేక్షకులు బోర్ పీల్ అయి... ఆ ప్రభావం సినిమాపై పడి ఉండేదని అంటున్నారు.


సత్యరాజ్, నరేష్, ప్రిన్స్, విజయ్‌కుమార్, రోహిణి, ప్రగతి, కృష్ణచైతన్య, ప్రదీప్‌రావత్, ధన్య బాలకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల, అనంతశ్రీరామ్, సాగర్, డ్యాన్స్: శంకర్, దినేష్, ప్రేమ్క్ష్రిత్, రఘు, ఫైట్స్: పీటర్ హేయిన్స్, హరి, దినేష్, ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, ఎడిటింగ్: శ్రీకర్‌ప్రసాద్, కెమెరా: సమీర్‌రెడ్డి, సంగీతం: దేవిశ్రీప్రసాద్, రచన, దర్శకత్వం: కిషోర్ తిరుమల.


స్లైడ్ షోలో డిలీట్ చేసిన సీన్స్ వీడియోస్...


నేను శైలజ డిలీటెడ్ సీన్ 1

నేను శైలజ మూవీలో నుండి డిలీట్ చేసిన సీన్ 1


సీన్ 2

నేను శైలజ చిత్రంలో డిలీజ్ చేసిన సీన్ 2


సీన్ -3

నేను శైలజ చిత్రం నుండి డిలీట్ చేసిన సీన్ 3


సీన్ 4

నేను శైలజ చిత్రం నుండి డిలీట్ చేసిన సీన్ 4


సీన్ 5

నేను శైలజ చిత్రం నుండి డిలీట్ చేసిన సీన్ 5


English summary
Watch Nenu Sailaja deleted scene. Starring Ram Pothineni and Keerthy Suresh in the lead roles, directed by Kishore Tirumala, produced by Sravanthi Ravi Kishore. Music composed by Devi Sri Prasad.
Please Wait while comments are loading...