»   » ‘నేత్ర’ ఆడియో విడుద‌ల‌!

‘నేత్ర’ ఆడియో విడుద‌ల‌!

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్‌ క్రియేషన్స్‌ పతాకంపై గోపీచరణ్‌, ఐశ్వర్య అడ్డాల‌ హీరో హీరోయిన్‌లుగా రెడ్డెం యాదకుమార్‌ దర్శకత్వంలో పీరికట్ల రాము నిర్మిస్తోన్న చిత్రం 'నేత్ర'. మై స్వీట్‌ హార్ట్‌ అనేది ట్యాగ్‌లైన్‌. ఉద‌య్ నాగ్ ర‌త‌న్ దాస్ సంగీతాన్ని స‌మ‌కూర్చిన ఈ చిత్ర ఆడియో మ్యాంగో ఆడియో ద్వారా మార్కెట్ లోకి ఆదివారంనాడు హైద‌రాబాద్ లో విడుద‌ల‌య్యాయి. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్ర‌ముఖ న‌టులు, మా అధ్య‌క్షులు డా.రాజేంద్ర‌ప్ర‌సాద్ తొలి సీడీ ఆవిష్క‌రించి స్టార్ మేక‌ర్ స‌త్యానంద్ కు అంద‌జేశారు. అనంత‌రం డా.రాజేంద్రప్ర‌సాద్ మాట్లాడుతూ....ఎంతో మంది హీరోల‌ను త‌యారు చేసిన స‌త్యానంద్ నేత్ర‌ చిత్రంలో న‌టించాడ‌ని తెలిసి మొద‌ట ఆశ్చ‌ర్య‌పోయాను. వార‌బ్బాయి కూడా ఈ చిత్రం ద్వారా న‌టుడుగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. త‌న‌కు మంచి భ‌విష్య‌త్ ఉండాల‌ని కోరుకుంటున్నా. పాట‌లు విన్నాక సంగీత ద‌ర్శ‌కుడికి మంచి సంగీత ప‌రిజ్ఞానం ఉంద‌ని తెలుస్తోంది. ట్రైల‌ర్ చూశాక సినిమా చూడాల‌న్న క్యూరియాసిటీ క‌లిగింది. క‌చ్చితంగా చూస్తాను. ద‌ర్శ‌కుడు మాట‌లు, చూసిన ప్రోమోస్ ను బ‌ట్టి ప్ర‌తిభాశాలి అని అర్థ‌మవుతోంది. స‌త్యానంద్ శిష్యులు, ఆయ‌న‌కు బాగా కావాల్సిన వారంతా క‌లిసి చేసిన ఈ ప్ర‌య‌త్నం ఫలించాల‌నీ ఆశిస్తూ...యూనిట్ అంద‌రికీ నా శుభాకాంక్ష‌లు అని తెలిపారు.

English summary
Nethra Movie Audio Launch event held at Hyderabad. Rajendra Prasad, Aishwarya Addala, Shivaji Raja, Tummalapalli Rama Satyanarayana, Satyanand graced the event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu