»   » కేవలం పాషన్‍‌తో సినిమాల్లోకి రావొద్దు : ఏఎన్ఆర్

కేవలం పాషన్‍‌తో సినిమాల్లోకి రావొద్దు : ఏఎన్ఆర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : తెలుగు సినీ రంగానికి సంబంధించి అగ్ర, ఆదర్శ నటుల్లో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. లివింగ్ లెజెంట్ గా, ఎంతో మందికి ఆదర్శ ప్రాయంగా నిలిచిన ఆయన....కొత్తగా సినీ రంగంలోకి అడుగు పెడదామనుకునే వారికి తనదైన రీతిలో సలహా ఇచ్చారు.

కేవలం పాషన్‍‌తో సినిమాల్లోకి రావొద్దని, భక్తితో రావాలని ఆయన సూచిస్తున్నారు. ఓ ఇంటర్య్వూలో ఆయన మాట్లాడుతూ....నటుడిగా పాపులర్ కావలంటే నటనపై అంకిత భావం, సినీరంగంపై భక్తి ఉండాలని, అదే విధంగా తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించగల ఓపిక, సత్తా ఉండాలని అన్నారు.

సినిమా అనేది ఎంతో గౌరవ ప్రదమైన ప్రొఫెషన్.....అంకిత భావం, భక్తితో సమర్థవంతంగా పని చేస్తే పేరుతో పాటు డబ్బు వస్తుంది. కేవలం ఫాషన్ తో వస్తే మాత్రం అనుకున్నది సాధించడం కష్టం. సినిమాపై భక్తి ఉన్నప్పుడే అనుకున్న లక్ష్యాన్ని సాధించడం సాధ్యమవుతుంది అని చెప్పుకొచ్చారు.

Akkineni Nageswara Rao

త్వరలో ఏఎన్ఆర్....తన తనయుడు నాగార్జున, మనవడు నాగ చైతన్యలతో కలిసి తెరపై కనిపించబోతున్నారు. అక్కినేని నాగేశ్వరరావుకు జోడీగా బాలీవుడ్ నిన్నతరం నటి రేఖ ఎంపికయింది. ఈచిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. పిఎస్ వినోద్ కెమెరామెన్. ఈ సినిమాలో వీరు ముగ్గురూ నిజ జీవితంలో మాదిరి అక్కినేని, నాగ్, చైతు ఈ చిత్రంలో తాత, తండ్రి, కొడుకు పాత్రలు పోషిస్తారు.

గతంలో నాగేశ్వరావు, నాగార్జున కలిసి కలెక్టర్ గారి అబ్బాయి చిత్రంలో నటించారు. ఆ తర్వాత ఈ సినిమాలో మూడు తరాల నటులు కలిసి నిజజీవిత పాత్రల్లో నటిస్తుండటంతో ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నాగార్జున నిర్మాతగా అన్నపూర్ణా స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ కలిసి ఈ భారీ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.

English summary
He was born in a farmer's family but grew up to be one of the country's acting legends. Akkineni Nageswara Rao believes one should enter films with devotion and not because it is the fashion to do so and says if you're popular, you're bound to be responsible for your actions.
Please Wait while comments are loading...