»   »  అమెరికా దెబ్బ'ఛానెల్స్'మీదకూడా..

అమెరికా దెబ్బ'ఛానెల్స్'మీదకూడా..

Posted By:
Subscribe to Filmibeat Telugu

తాజాగా అమెరికాలో ఆర్ధిక సంక్షోభం తలెత్తిన సంగతి తెలిసిందే. దాని ప్రభావంతో ఇక్కడ రియల్ ఎస్టేట్ బూమ్ బాగా తగ్గుతోంది. ఇక రియల్ ఎస్టేట్ బూమ్ తో ముడిపడ్డ సినిమా నిర్మాణాలు,కొత్త టీవీ ఛానల్స్ రాకలపై ఈ ఎఫెక్ట్ తీవ్రస్ధాయిలో ఉండేటట్లు కనపడుతోంది. సినిమాల్లో రియల్ ఎస్టేట్ వారి పుణ్యమా అనే వారానికో సినిమా ప్రారంభం అవుతోంది. రిసార్ట్స్ లలో సినిమా వ్యవహారాలన్నీ నడుస్తున్నాయి. ఫైనాన్సియర్స్ కి భూములను చూపి అప్పులను పడుతున్నారు.

అట్లానే డబ్బులు పోగుట్టుకున్నప్పుడు కూడా రియల్ ఎస్టేట్ వారు తమకు పెట్టుబడి పెట్టిన వారికి సెటిల్ మెంట్ గా తమ ఆధీనంలో ఉన్న భూములను రాస్తున్నారు. ఇది కొంతకాలంగా చక్రంలా జరుగుతున్న వ్యవహారం. అయితే ఇప్పుడు దానికి గండి పడనుంది.

ఇక టీవీ రంగానికి వస్తే రియల్ ఎస్టేట్ లో సంపాదించిన మొత్తాలతో చాలా మంది ఛానెల్స్ పెట్టారు. పెడుతున్నారు. ఒక రకంగా చాలా మంది తమ పెట్టుబడులను పెంచే సాధనంగా మీడియాని చూస్తే మరో రకంగా రాజకీయంగా తమ పలుకుబడి పెంచుకునేందుకు తమ ఆస్ధులను భద్రపరుచుకునేందుకు ఎవరితో ఏ ఇబ్బందులు రాకుండా ఓ కంచెలా ఛానెల్ ని ఏర్పాటు చేసుకుంటున్నారనేది నిష్టూర సత్యం. ఈ కోవలో గత ఏడాది కాలం నుండీ ఓ డజను ఛానెల్స్ దాకా వచ్చాయి.

మీడియా బూమ్ వచ్చిందని ఉద్యోగస్ధులు జీతాలు పోటీపడి పెంచారు. సాప్ట్ వేర్ పరిశ్రమతో సమానంగా జీతాలు అందుకనే వారు బయిలుదేరారు.అయితే అమెరికాలో ఆర్ధిక సంక్షోభం ఒక్కసారిగా తలత్తటంతో సాప్ట్ వేర్ రంగంలోనూ,రియల్ ఎస్టేట్ రంగంలోనూ వీటిని నమ్ముకుని వెల్సిన మీడియాలోనూ సంక్షోభం మొదలయ్యే పరిస్ధితులు కనపడుతున్నాయి.అంతెందుకు మొన్న దసరాకు చాలా ఛానెల్స్ రానున్నాయని టెస్ట్ సిగ్నల్స్ వస్తాయిని పబ్లిసిటీ ప్రారంభమయింది.

అయితే అనుకోని విధంగా కొంతమంది వెనక్కి తగ్గి ఏసియా నెట్ వారి సితార, ఎన్.టివి వారి వనిత,అశ్వనీదత్ లోకల్ టీవీ మాత్రమే వచ్చాయి. ఇక ఇప్పుడున్న ఛానెల్స్ లోనూ,రాబోయే వారిలోనూ చాలా మంది రియల్ ఎస్టేట్ కి సంభందించిన వారే. అందులోనూ అమెరికా ఆర్ధికసంక్షోభం దెబ్బకి ఇక్కడా కొన్ని పెద్ద కంపెనీలు సైతం పొదుపు ఉద్యమాన్ని చేపడతాయి. ఇటువంటి స్ధితిలో యాడ్స్ రావటం కష్టమే.ఈ పరిస్ధితుల్లో ఏ ఛానెల్ వస్తుందో ...ఏ ఛానెల్ ఎన్నికలు వరకూ నిలబడుతుందో తెలియని స్ధితి.

అయితే ఈ డిసెంబర్ కి హెచ్.ఎమ్ టీవి,సాక్షి,జీ ఇరవై నాలుగు గంటలు,ఆసియానెట్ న్యూస్,స్టూడియో ఎన్ ,ఆర్ టీవీ, ఆంద్ర జ్యోతి ఛానెల్ వచ్చే అవకాశం ఉంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X