బాలకృష్ణ 100వ చిత్రం వివరాలు నిర్మాత వెల్లడి
హైదరాబాద్ : వంద చిత్రాలకు బాలకృష్ణ చేరువ అవుతున్న తరుణంలో ఈ చిత్రాన్ని ఎవరు నిర్మిస్తారు? దర్శకుడెవరు?? అనే విషయం గురించి ఫిల్మ్‌నగర్‌లో చర్చ జరుగుతోంది. అయితే ఈ చిత్రానికి నిర్మాత
బాలయ్యతో 'శ్రీరామరాజ్యం' నిర్మించిన యలమంచిలి సాయిబాబు అని ఖరారైపోయింది. అయితే దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారనే వార్త నలుగుతోంది. అయితే ఈ వార్త ఎంత మాత్రం నిజం కాదని మీడియాతో మాట్లాడుతూ సాయిబాబు స్పష్టం చేశారు.

ఇటు తెలుగు, అటు హిందీ రంగానికి బాగా సుపరిచితుడైన ఓ వ్యక్తి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారని సాయిబాబు చెప్పారు. ఆ వ్యక్తి బహుశా ఈ సినిమా ద్వారానే దర్శకుడు అయ్యే అవకాశం కూడా వుండొచ్చు అన్న ఒక 'క్లూ'ని మాత్రం ఇచ్చి, ఆ పేరుని ఆయన రహస్యంగా ఉంచదలిచారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి 28న ప్రారంభిస్తామని ఆయన చెప్పారు.
హీరోయిన్స్ గా ఇద్దరు విదేశీ భామలను దాదాపుగా ఖరారు చేశామని అన్నారు. ఇది బాలయ్య నూరవ చిత్రం కావడంతో అత్యంత భారీగా నిర్మించాలని సాయిబాబు చెప్తున్నారు. అయితే ఆయన మళ్లీ జనాలని సస్పెన్స్ లో పడేసారు. ఇటు తెలుగు అటు హిందీ రంగానికి సుపరిచితుడైన ఆ దర్శకుడెవరు? అనే విషయం మీదే ఇప్పుడు అందరి ఊహాగానాలు మొదలయ్యాయి.

Click it and Unblock the Notifications